Begin typing your search above and press return to search.

జగన్ పాలనకు దేశవ్యాప్త ప్రశంసలు

By:  Tupaki Desk   |   16 Jun 2021 6:30 AM GMT
జగన్ పాలనకు దేశవ్యాప్త ప్రశంసలు
X
జగన్ కు ఇంటా బయటా ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆయన మొక్కవోని పట్టుదలతో అన్నింటిని చిత్తు చేస్తూ ముందుకెళుతున్నారు. అన్ని సామాజికవర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. రోజురోజుకు కొత్త పథకాలతో ముందుకెళుతున్నారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి బాగున్నా.. లేకున్నా.. ఇచ్చిన మాటకు కట్టబడి పేదలకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రజలు జగన్ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ పథకాలు, పాలనపై జాతీయ స్థాయిలో మంచి స్పందన వస్తోంది. తాజాగా నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి ఏపీలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ బ్రహుమతి గ్రహీత, బాలల హక్కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ బహుమతి గ్రహీత , బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి ప్రశంసించారు.

కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయడం గొప్ప విషయమన్నారు. కోవిడ్ మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రూ.180 కోట్లతో పిల్లల కోసం 3 ఆస్పత్రులను నిర్మించాలన్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు.

ఇక ఏపీలో 17005 కాలనీల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం ప్రపంచంలోనే అరుదైన అంశమని కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రశంసించారు. నీతి అయోగ్ కూడా ఏపీ సర్కార్ కు కితాబిచ్చింది. కరోనా సమయంలో పేదలకు అందుతున్న వైద్యంపై నీతి అయోగ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఇక ఉన్నత విద్యకు సంబంధించి పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ రాష్ట్రాల జాబితాలో నిలిచిందని ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యూకేషన్ వెల్లడించింది. ఇలా జగన్ పాలనలో జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురవడం ప్రాధాన్యత సంతరించుకుంది.