Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ కు నో చెప్పిన నాటో.. ప్రెసిడెంట్ అసంతృప్తి!
By: Tupaki Desk | 5 March 2022 7:07 AM GMTఉక్రెయిన్-రష్యా యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలపై బాంబుల మోత మోగుతోంది. ఇప్పటికే పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. జనాలు బంకర్లలో బిక్కు బిక్కుమంటున్నారు. అయితే ఇరు దేశాల సైన్యాలు భీకరంగా పోరాడుతున్నాయి. యుద్ధాన్ని ఇప్పట్లో విరమించేటట్లుగా పరిస్థితులు లేవు.
ఈ నేపథ్యం లో ఉక్రెయిన్ లో నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటో దేశాలను కోరారు. అయితే తమకు మద్దతుగా ఉన్న నాటో నుంచి అనుకూల స్పందన వస్తుందని భావించారు. కానీ ఈ విషయంలో జెలెన్ స్కీకి నో చెప్పారు.
నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షల విషయంలో నాటో దేశాలు ఉక్రెయిన్ కు షాక్ ఇచ్చాయి. ఉక్రెయిన్ అభ్యర్థనను తోసి పుచ్చాయి. అందుకు గల కారణాలను కూడా వివరించారు. బస్సెల్స్ నాటో విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాటో జనరల్ సెక్రటరీ స్టోలెన్ బర్గ్ తెలిపారు. నో ఫ్లైయింగ్ జోన్ విధించాలంటే నాటో యుద్ధ విమానాలను పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతే కాకుండా రష్యా యుద్ధ విమానాల తో పోరాడాల్సి వస్తుందని అన్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ కు మద్దతిస్తే... లేనిపోని చిక్కులు వస్తాయని భావించారు.
ఉక్రెయిన్ లో నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు విధిస్తే... యూరప్ లో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేపినట్లే అవుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పలు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని అన్నారు. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అభ్యర్థనను తిరస్కరించినట్లు నాటో జనరల్ సెక్రటరీ వివరించారు.
నాటో ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో బాంబుల మోత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మరింత బాంబింగ్ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ దేశంలో ఉద్రిక్తత తీవ్ర రూపం దాల్చక ముందే స్పందించాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిట్రో కులేబా కీవ్ కోరారు. ఉక్రెయిన్ ను మరో సిరియాగా మార్చ వద్దంటూ విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా రష్యాను ఎదుర్కొనేందుకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ యుద్ధంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశమైంది. మెక్సికో, ఫ్రాన్స్ దేశాల ప్రతిపాదన మేరకు చర్చిస్తోంది. యుద్ధం ముగింపు దిశగా చర్చలు జరుగుతున్నాయి.