Begin typing your search above and press return to search.

రష్యాను కామన్ శతృవుగా తేల్చేసిన నాటో

By:  Tupaki Desk   |   30 Jun 2022 3:15 AM GMT
రష్యాను కామన్ శతృవుగా తేల్చేసిన నాటో
X
ఉక్రెయిన్ పై గడచిన నాలుగు నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యాను నాటో దేశాలు, అమెరికా తమకు కామన్ శతృవుగా ప్రకటించాయి. మాడ్రిడ్ లో జరిగిన అమెరికా, నాటో దేశాల కీలకమైన సమావేశంలో ఈ మేరకు దేశాలధిపతులు ఏకగ్రీవంగా తీర్మానంచేశారు. ఉక్రెయిన్ పై యుద్ధం చేయటాన్ని ఈ దేశాలన్నీ సంయుక్తంగా ఖండించాయి. భవిష్యత్తులో తమకు రష్యానుండి ఎదురవ్వబోయే ముప్పును నాటో దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి.

రష్యాతో ఏ తమలో ఏ దేశంకూడా శతృత్వాన్ని కోరుకోవటం లేదని చెబుతునే రష్యా బెదిరింపులకు ఎట్టి పరిస్ధితుల్లోను భయపడేదిలేదని ప్రకటించాయి. ఇదే సమయంలో రష్యాను ధీటుగా ఎదుర్కొనేందుకు ఐరోపా దేశాలు మొత్తంమీద భారీ ఎత్తున బలగాలను మోహరించాలని డిసైడ్ చేశాయి.

అమెరికాకు చెందిన సైన్యం ఐరోపా దేశాల్లో మోహరించేందుకు అన్నీ దేశాలు ఏకగ్రీవంగా స్వాగతించాయి. ఉక్రెయిన్ కు పొరుగునే ఉన్న పోలండ్ లో అమెరికా శాస్వత సైనిక స్ధావరాన్ని ఏర్పాటు చేయబోతోంది.

బ్రిటన్ కు రెండు అదనపు ఎఫ్-35 స్వ్కాడ్రన్ దళాలను పంపబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. తొందరలోనే ఇటలీ, జర్మనీలో వైమానికి రక్షణ దళాలను మోహరించాలని నిర్ణయించినట్లు బైడెన్ చెప్పారు.

మొత్తంమీద ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే రష్యాకు వ్యతిరేకంగా అన్నీ దేశాలను అమెరికా తన దగ్గరకు తీసుకుంటోంది. ఇదే సమయంలో అన్నీ దేశాల్లో అమెరికా సైన్యంతో పాటు అమెరికాలో తయారైన ఆయుధాలను మోహరించబోతోంది.

ఇక్కడ మోహరించబోతోందంటే చాలా దేశాలు అమెరికాలో తయారయ్యే ఆయుధాలను కొనేట్లు చేయటమే. అంటే రష్యాను బూచిగా చూపించి అమెరికా తన ఆయుధాలను అమ్ముకునేందుకు పెద్ద ప్లాన్ వేసినట్లే కనబడుతోంది. నాటో దేశాల్లో దేనికి కూడా ఒంటరిగా రష్యాను ఎదుర్కొనేంత స్ధాయి లేదని అందరికీ తెలిసిందే. ఏ దేశం రష్యానుండి ఇబ్బందులు వస్తున్నాయని గ్రహించగానే వెంటన తమవైపు చూసేట్లుగా అమెరికా అన్నింటిని మెంటల్ గా ప్రిపేర్ చేస్తోంది. దీనిద్వారా ఆయుధాల బిజినెస్ ను చేసుకోవటమే అమెరికా ముఖ్య ఉద్దేశ్యం.