Begin typing your search above and press return to search.

'నాటు' వర్సెస్ 'వై నాట్'

By:  Tupaki Desk   |   16 Jan 2023 10:04 AM GMT
నాటు వర్సెస్ వై నాట్
X
సినిమాలకు రాజకీయాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. రెండూ జనంతోనే పని ఉన్న రంగాలు. జనాదరణే ఎక్కడైనా కొలమానం. హిట్టూ ఫట్టూ వారే డిసైడ్ చేస్తారు. టాలీవుడ్ కి వస్తే పాన్ ఇండియా లెవెల్ నుంచి పాన్ వరల్డ్ లెవెల్ కి తెలుగు సినిమా వైభవం పాకిపోతోంది. ట్రిపుల్ ఆర్ మూవీ ఆ రేంజిని సాధిస్తోంది.

ఇక రాజకీయాల్లో చూస్తే ప్రాంతీయ రాజకీయం కాస్తా జాతీయ స్థాయికి ఎగబాకుతోంది. కొన్ని సార్లు ఇంటర్నేషనల్ పరిణామాలను టచ్ చేస్తూ కలరింగ్ ఇస్తోంది. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ లో నాటు నాటు సాంగ్ ఇపుడు పాన్ వరల్డ్ సాంగ్ గా ఒక ఊపు ఊపుతోంది. ఈ సాంగ్ గోల్డెన్ క్లబ్ అవార్డుతో పాటు మరిన్ని అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుని విశ్వ యవనిక మీద జెండా ఎగరేస్తోంది.

మరో వైపు చూస్తే నాటు నాటు సాంగ్ సక్సెస్ ఇంటర్నేషనల్ సక్సెస్ గా నమోదు అవుతోంది. అంతే కాదు ఆస్కార్ కి కూడా వెళ్ళింది. ఆ పాటతో కూడా ట్రిపుల్ ఆర్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది అని అంటున్నారు. అలా కనుక చూస్తే ఇపుడు ఎక్కడ చూసినా నాటు నాటు సాంగ్ ఫీవరే కనిపిస్తోంది. ఎక్కడ చూసినాఅ పాట గురించే చెప్పుకుంటున్నారు.

మరి ఏపీ రాజకీయాల్లో మరో నాటు కూడా తెగ వైరల్ అవుతోంది. ఈ నాటు రాజకీయ ఆశగా ఉంది. అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వై నాట్ అంటూ పదే పదే పాట మాదిరిగా పాడుతున్నారు. ఒక విధంగా పందెం అంటున్నారు. ఆయన పార్టీ వారితో మీటింగులు పెడితే వై నాట్ అంటున్నారు. వై నాట్ 175 అంటూ హడావుడి చేస్తున్నారు.

అయితే నాటు నాటు సాంగ్ హిట్ అయింది. ఇంటర్నేషనల్ ఫేం అయింది. కానీ వై నాటు రీజనల్ లెవెల్ లో హిట్ అవుతుందా నిజానికి అంత సీన్ ఉందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. వై నాట్ అని జగన్ అన్నా కూడా వైసీపీ శ్రేణులు అంత లేదులే అని అనుకుంటున్నారుట. దానికి కారణం నాలుగేళ్లలో ఏపీలో పాలన అలా ఉంది అని అంటున్నారు.

వైసీపీ హై కమాండ్ విషయమే తీసుకుంటే క్యాడర్ కి ఏమి చేశారు అన్నదే వారు సంధిస్తున్న ప్రధానమైన ప్రశ్న. అలాగే ప్రభుత్వం ఘనకార్యాలు చెప్పుకుందామనుకుంటే కూడా ఏమున్నాయని అంటున్నారు. ఎంతసేపూ అప్పులూ పంచుడు తప్ప కొత్తగా చెప్పేది ఏముంది అని పెదవి విరుస్తున్నారు. వైసీపీ జెండా పదేళ్ళుగా మోసిన తమని కనీసంగా పట్టించుకున్నారా అని వారు నిలదీస్తున్నారు.

మరి తమను అలా దూరం పెట్టి ఏమీ చేయకుండా ఎండబెట్టి ఇపుడు వై నాట్ 175 సీట్లు అంటే ఎలా వస్తాయండి అని వారు బిగ్గరగానే ప్రశ్నిస్తున్నారు. ఏపీలో మరోసారి గెలవాలి అంటే పార్టీ శ్రేణుల నమ్మకాన్ని ముందు పొందాలని. కానీ నేల విడిచి సాము చేసినట్లుగా పార్టీ వారే పెదవి విరిచేలాగ పనితీరు ఉందని, అలాగే తమను ఏమీ కానట్లుగా పక్కన పెట్టేశారని వాపోతున్నారు.

గంభీరంగా స్టేట్మెంట్స్ ఇస్తూ వై నాట్ 175 అంటే అది ప్రకటనల వరకూ బాగానే ఉంటుంది కానీ రీ సౌండ్ చేయడం అంటే మాత్రం కష్టమని అంటున్నారు. దేనికైనా కసి కృషి ఉండాలని కానీ క్యాడర్ లో కసిని కావాలనే చంపేశారని, ఇక కృషి చేయమంటే నేలబారుడు రాజకీయంతో వారు ఏమి చేస్తారు అని అంటున్నారు.

సో నాటు నాటు సాంగ్ సూపర్ హిట్ అయింది. వై నాట్ అంటూ జగన్ పాడుతున్న పాట మాత్రం పార్టీ క్యాడర్ పెదవుల దాటి బయటకు రావడం లేదు అంటున్నారు. మరి దీనిని అర్ధం చేసుకుని ఇకనైనా సరైన మరమ్మత్తులు చేసుకోకపోతే మాత్రం వై నాట్ కాదు నాటు నాటు పాటే అంతా చివరికి పాడుకోవాల్సి వస్తుందని క్యాడర్ నుంచి వస్తున్న అసలైన సెటైర్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.