Begin typing your search above and press return to search.
ఒళ్లు బలుపు చైనాను ప్రకృతి సైతం పట్టించుకోవట్లేదే?
By: Tupaki Desk | 20 July 2021 10:58 AM GMTఈ భూప్రపంచంలో ఎవరు తప్పు చేసినా.. చేయకున్నా సరే శిక్షించే అధికారం దేవుడు అమెరికా.. చైనాకే ఇచ్చాడన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి ఆ దేశాలు. చైనాతో పోలిస్తే అమెరికా కొంత నయం. ఆ దేశం కన్ను పడితే సహజవనరులు దోచుకెళదామనుకుంటుందే తప్పించి.. ఆ దేశాల్ని సర్వనాశనం చేయాలనుకోదు. అలా అని చిల్లరగా గిల్లికజ్జాలు తొందరపడి పెట్టుకోదు. కానీ.. డ్రాగన్ దేశమైన చైనా మాత్రం అందుకు భిన్నం. ఆ దేశంతో సరిహద్దులు ఉన్న దేశాలు ఏవైనా సరే.. చిక్కులు తప్పవు. కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ మాదిరి వ్యవహరించే చైనా.. తనతో సరిహద్దుల్ని పంచుకునే ప్రతి దేశంతోనే ఏదోలా పంచాయితీ పెట్టుకోవటం.. అదేపనిగా బెదిరించటం ఒక అలవాటుగా మారింది.
ఇప్పుడా దేశానికి తైవాన్ కు మధ్య పంచాయితీ విషయంలో జపాన్ ఈ మధ్యన ఘాటు వ్యాఖ్య చేయటం తెలిసిందే. తైవాన్ కు తమ సాయం ఉంటుందని తేల్చటంతో పాటు.. అండగా నిలుస్తామన్న మాటను కూడా జపాన్ ఉప ప్రధాని తారో అసో స్పష్టమైన ప్రకటన చేశారు. తైవాన్ మీద కన్నేసిన చైనా.. తాజాగా జపాన్ తీరుపై ఆగ్రహంతో ఉంది. ఆ దేశానికి వార్నింగ్ ఇవ్వాలన్న కసితో ఉన్న డ్రాగన్ తాజాగా దారుణ వ్యాఖ్యలు చేసింది. చైనా సైనికులు చేసిన ఒక వీడియోను చైనా అధికారిక పార్టీ చానల్ లో ప్రసారం చేయటం ద్వారా.. ఆ పిచ్చి వ్యాఖ్యలకు తన ఆమోదం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. తైవాన్ కు వత్తాసుగా నిలిచిన జపాన్ కు దారుణ రీతిలో వార్నింగ్ ఇచ్చేసింది.
సంబంధం లేని విషయాల్లో పట్టించుకుంటే తిప్పలు తప్పవని హెచ్చరించటమే కాదు.. అలా చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసింది. అవసరమైతే అణు ఆయుధాల్ని వినియోగిస్తామంటూ జపాన్ ను ఉద్దేశించి నోరు పారేసుకుంది. తాజాగా ప్రసారమైన వీడియోలో చైనా సైనికులు మాట్లాడుకున్న మాటలు సంచలనంగా మారాయి. 'తైవాన్ విషయంలో కలుగజేసుకున్నందుకు జపాన్ పై మేం బాంబులు వేస్తాం. ఆ తర్వాత లొంగిపోయామని జపాన్ మమ్మల్ని బతిమిలాడుకునే వరకూ రెండోసారి బాంబులేస్తాం. తైవాన్ విముక్తి మా చేతుల్లోని అంశం. జపాన్ జోక్యాన్ని సహించేది లేదు. జపాన్ కు చెందిన ఒక యుద్ధ విమానం.. ఒక సైనికులు తైవాన్ సరిహద్దుల్లో కనిపించినా ఆ దేశాన్ని నామరూపాల్లేకుండా సర్వనాశనం చేస్తాం'' అంటూ కొందరు సైనికులు చేసిన వ్యాఖ్యలు పెను కలకలాన్ని రేపుతున్నాయి.
ఈ వీడియోపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. చైనా అధికారిక చానల్ సీసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రదర్శిస్తున్నారు. అయితే.. భారీగా వైరల్ అయి.. విమర్శలు వెల్లువెత్తిన తర్వాత ఈ వీడియోను డిలీట్ చేశారు. అయితే.. యూట్యూబ్.. ట్విటర్ లో మాత్రం ఇంకా దర్శనమిస్తూనే ఉంది. తైవాన్ విషయంలో చైనా తీరును పలువురు తప్పు పడుతున్న వేళ.. జపాన్ కు డ్రాగన్ దేశం ఇచ్చిన వార్నింగ్ సరికాదంటున్నారు.
అణుదాడి పేరుతో బాద్యత లేకుండా మాట్లాడుతున్న డ్రాగన్ దేశం మదాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న చైనాకు బుద్ధి చెప్పేటోడు భూ ప్రపంచంలో ఏమీ లేదా? అన్నది ప్రశ్నగా మారింది. ఒళ్లంతా అహంకారం.. అంతకు మించిన ఒళ్లు బలుపు.. ఎవరూ ఏమీ చేయలేరనే మిడిసిపాటును లెక్క తేల్చే శక్తి ఏదో ఒకటి వస్తే కానీ బాగుండదన్న అభిప్రాయం పలువురు నోట వినిపిస్తోంది. ఇప్పటికే కరోనాను ప్రపంచానికి అంటించేసి.. చేతులు దులిపేసుకున్న చైనాను ఎవరూ ఏమీ చేయలేరా? అన్న సందేహం కలుగక మానదు.
https://twitter.com/jenniferatntd/status/1414971285160005634