Begin typing your search above and press return to search.
కరోనాకు నేచురోపతి.. ఈ ఆకు రసం పనిచేస్తుందట!
By: Tupaki Desk | 29 April 2021 2:30 AM GMTనిజానికి మన చుట్టూ ఉండే మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కానీ.. ఆ విషయం మనకు తెలియదు. అది ఏ రోగానికి? ఎలా ఉపయోగపడుతుంది? అనే విషయాలు ఆయుర్వేదంపై అవగాహన ఉన్నవాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఆ విధంగా.. ఆయుర్వేద నిపుణులు సూచించిన ఎన్నో ప్రకృతి ఔషధాల్లో ఒకటి తులసి.
ఈ తులసి దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే అవకాశం ఉంది. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ తులసి మనుషులకు చాలా విధాలుగా మేలు చేస్తుంది కాబట్టే.. ఇంట్లో పెంచుకునేలా ప్రోత్సహించారని చెబుతుంటారు. అంతగొప్ప గుణం కలిగినది కాబట్టే.. తులసి కోటకు మొక్కుతారని, ఉదయాన్నే తులసికి చేసే పూజల్లో అంతరార్థం ఇదేనని చెబుతుంటారు కొందరు.
నిజానికి.. దగ్గు, జలుబు చేసినవారు తులసిని ఆశ్రయిస్తుండడం ఇప్పటికే మనకు తెలుసు. ఇంకా.. అజీర్తికి కూడా చక్కటి మందుగా పనిచేస్తుందని కూడా తెలుసు. అయితే.. కరోనా విజృంభిస్తున్న సమయంలో బాధితులను ఆదుకునేందుకు ఈ తులసి కూడా తన వంతు సహకారం అందిస్తోందని చెబుతున్నారు. క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని అంటున్నారు.
నిత్యం కొన్ని తులసి ఆకులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుందని చెబుతున్నారు. ఇక, 8 నుంచి 10 ఆకులు, ఐదు లవంగాలను ఒక కప్పు నీటిలో వేసి దాదాపు పది నిమిషాల పాటు వేడి చేయాలి. దీన్ని వడకట్టి గోరువెచ్చగా తాగితే దగ్గు నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
అంతేకాకుండా.. కిడ్నీల పనితీరు కూడా మెరుగు పడుతుందని అంటున్నారు. ఉదయాన్నే పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగి, ఐదారు తులసి ఆకులు నమిలి తినడం ద్వారా జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని చెబుతున్నారు. కిడ్నీల్లో రాళ్లు కూడా కరుగుతాయని చెబుతున్నారు. తేనెలో తులిసి రసం కలిపి ఐదారు నెలలపాటు తీసుకోవడం ద్వారా రాళ్లు మాయమవుతాయని అంటున్నారు.
ఇప్పుడు కొవిడ్ కండీషన్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడంలో తన వంతు సహకారాన్ని తులసి అందిస్తుందని చెబుతున్నారు. వైద్యుల సలహాలు, ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. తులసిని తీసుకోవడం ద్వారా.. మంచి ఫలితం పొందొచ్చని అంటున్నారు.