Begin typing your search above and press return to search.
కసబ్2 : వీడికీ మనసు ఉంది
By: Tupaki Desk | 20 Sep 2015 8:54 AM GMTఉగ్రవాదులు అంటే కరడుగట్టిన వాళ్లు అనేది నిజమే. వాళ్ల ప్రాణాలను, ఎదుటివారి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నమ్ముకున్న మూర్ఖపు సిద్ధాంతం కోసం పనిచేస్తుంటారు. ఇందులో ముస్లిం చాంధసవాదం నరనరాన నిండిపోయిన పాకీ-స్థాన్ కు చెందిన వారైతే...మాటల్లో చెప్పక్కర్లేదు కదా. అయితే అలాంటి వాళ్లను కూడా జైలు జీవితం మనిషిగా మార్చుతుంది. తక బ్రతుకు కుక్క బ్రతుకు అయిపోయింది అనే జ్ఞానోదయం అయ్యేలా చేస్తుంది. సరిగ్గా అలాంటిది ఇపుడు జరిగింది మరి.
ఉధంపూర్ దాడిలో గత నెల ప్రాణాలతో పట్టుబడిన ఉగ్రవాది మొమహ్మద్ నవేద్ యాకుబ్ పాకిస్థాన్ కు చెందిన వాడేనని భారత దేశం వాదిస్తోంది.
అయితే పాకిస్తాన్ మాత్రం తమకేమీ సంబంధం లేదని చెప్పుకొస్తుంది. కానీ తాజాగా ఆ వాదనను బలపరిచే స్పష్టమైన ఆధారాలు లభించాయి. స్వయంగా ఉగ్రవాది నవేద్ యాకుబ్ కోర్టులో తనకు స్వదేశం పాకిస్థాన్ వెళ్లి తల్లిదండ్రులను చూడాలని ఉందని చెప్పాడు. ఈ విషయాన్ని అతడు జమ్మూలోని ప్రత్యేక కోర్టులో చెప్పాడు.
తనకు తన తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉందని నవేద్ ప్రత్యేక కోర్టులో చెప్పాడు. తల్లిదండ్రుల ఫోన్ నంబర్ ను ఇప్పటికే అతడు ఎన్ ఐఏకు ఇచ్చాడు. కోర్టులో నవేద్ మాట్లాడుతూ ‘నా తల్లిదండ్రులు పదేపదే గుర్తుకు వస్తున్నారు. వాళ్లతో మాట్లాడి చాలా కాలమైంది. వాళ్లతో ఫోన్ లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి’ అని న్యాయమూర్తిని వేడుకున్నాడు. నవేద్‌కు తల్లిదండ్రులంటే ఇపుడు అభిమానం కలిగినట్లే వాడు భారతీయులపై దాడులు చేసే సమయంలో ఎందుకు కలగలేదు? అభిమానం, ప్రేమ అందరికీ ఉంటాయని మత చాందస సంస్థలు ఎప్పుడు వాళ్లకు జ్ఞానోదయం కలిగిస్తాయో.