Begin typing your search above and press return to search.
పట్నాయక్ రికార్డు...వరుసగా ఐదో సారి ఒడిశాకు సీఎం
By: Tupaki Desk | 23 May 2019 9:20 AM GMTసార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే బీజేపీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. అదే సమయంలో ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విపక్ష వైసీపీ విజయం ఖాయమైపోయింది. అదే క్రమంలో ఒడిశాలో ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ సరికొత్త రికార్డును సృష్టించనున్నారు. ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు ఒడిశాకు సీఎంగా వ్యవహరించిన నవీన్... ఈ దఫా ఎన్నికల్లోనూ విజయం నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా వరుసగా ఐదో సారి ఆ రాష్ట్రానికి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న నవీన్... సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకోనున్నారు. మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసిన నవీన్ ఆధ్వర్యంలోని బీజేడీ... వంద సీట్లలో విజయం సాధించే దిశగా సాగుతోంది.
ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను బీజేడీ దాటేయడంతో నవీన్ వరుసగా ఐదో సారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమైపోయింది. దీంతో నవీన్ సరికొత్త రికార్డును సృష్టించనున్నారు. ఇదిలా ఉంటే... అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్న బీజేడీ... లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అంతగా రాణించలేకపోయింది. ఒడిశాలో మొత్తం 21 ఎంపీ స్థానాలుంటే... బీజేడీ 12 స్థానాలకు మాత్రమే పరిమితం కానుంది. మిగిలిన 9 చోట్ల బీజేపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. 2014లో బీజేపీని సింగిల్ సీటుకు పరిమితం చేసేసిన బీజేడీ... 20 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ దఫా మాత్రం కేవలం 12 సీట్లకే పరిమితం కానుంది. అంటే... గతంలో తన ఖాతాలోని 8 సీట్లను బీజేడీ ఈ సారి బీజేపీకి వదిలేసిందన్న మాట.