Begin typing your search above and press return to search.

ఒడిశా సీఎం ఆస్తుల విలువ ఎంతో తెలుసా.?

By:  Tupaki Desk   |   21 March 2019 4:55 PM GMT
ఒడిశా సీఎం ఆస్తుల విలువ ఎంతో తెలుసా.?
X
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాకూడా కొంతమంది అతి సామాన్యంగా బతికేస్తుంటారు. మిగిలిన వారిలా ఆస్తులు పోగెయ్యాలని - తరతరాలకు సంపాదించాలని ఏం అనుకోరు. అలాంటి వారిలో అందరికంటే ముందు ఉంటారు త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌. మాణిక్‌ సర్కార్‌ ఆస్తి కేవలం లక్షల్లోనే ఉంటుంది. అందరిలా రైలు జనరల్‌ భోగీలో ప్రయాణిస్తుంటారు ఆయన. అలాంటి వ్యక్తి కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు మాణిక్‌ సర్కార్‌ తర్వాత లిస్ట్‌ ఉండే వ్యక్తి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌. ఒడిశాకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నవీన్‌ పట్నాయక్‌ కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే చాలా తక్కువ ఆస్తి ఉంది.

2019లో ఒడిషాలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మన దగ్గర పవన్‌ కల్యాణ్‌ లా ఆయన కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు. ఎన్నికల్లో పోటీ సందర్భంగా ఆయన తన అఫిడవిట్‌ లో తనకున్న ఆస్తుల్ని ప్రకటించారు. 2014లో నవీన్ పట్నాయక్ అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో ఆయనఆస్తులను రూ. 12 కోట్లుగా పేర్కొన్నారు. 2014తో పోలిస్తే ఈ సారి నవీన్‌ ఆస్తుల విలువ ఐదురెట్లు పెరిగింది. 2019లో నవీన్‌ పట్నాయక్ ఆస్తి రూ.63 కోట్లుగా ప్రకటించారు. ఇందుకుకారణం ఒడిషా - దేశ రాజధాని ఢిల్లీలో తనకున్నఆస్తుల విలువ అమాంతం పెరగడమే అని అఫిడవిట్‌ లో తెలిపారు. తన సోదరి గీతాతో కలిసి ఆయనకు కొన్ని ఆస్తులున్నాయి. న్యూఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇల్లు విలువ రూ.43 కోట్లు కాగా ఒడిషాలోని నవీన్ నివాస్ ఇల్లు విలువ రూ.9.52 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం నవీన్ పట్నాయక్దగ్గర రూ.25వేలు నగదు చేతిలో ఉండగా... 1980 నాటి అంబాసిడర్ కారు ఉన్నట్లు అఫిడవిట్‌ లో చేర్చారు. ఇక కారు విలువ రూ. 9వేలు అని పేర్కొన్నారు.