Begin typing your search above and press return to search.
కేసీయార్ అడ్డాలో ఒడిశా సీఎం.... దాని కోసమే వేట
By: Tupaki Desk | 11 Oct 2022 4:07 AM GMTపెట్టుబడులు తమ సొంత రాష్ట్రానికి రావాలి. అయితే ఎవరో తమ రాష్ట్రానికి వచ్చి కలిస్తే వారికి నాలుగు మంచి విషయాలు చెప్పి తమ స్టేట్ లో పెట్టుబడులు పెట్టించుకోవడం వేరు. ఇది ఓల్డ్ ట్రెండ్. పెట్టుబడులు, బిజినెస్ పీపుల్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వారిని కన్విన్స్ చేసి భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం నయా ట్రెండ్. అన్ని విషయాల్లో ఓల్డ్ ట్రెండ్ ని ఫాలో అయ్యే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పెట్టుబడుల వేట విషయంలో మాత్రం న్యూ ట్రెండ్ కే జై కొడుతున్నారు.
అందుకే ఆయన తెలంగాణా రాజధాని కేసీయార్ రాజకీయ అడ్డా అయిన హైదరాబాద్ లోనే వేట స్టార్ట్ అంటున్నారు. పెట్టుబడులను ఒడిషాలో పెట్టమని కోరేందుకు ఈ నెల 17న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ హైదరాబాద్ కి వెళ్తున్నారు. అక్కడ పెట్టుబడుల రోడ్ షో లో పాల్గొని బిజినెస్ టైకూన్లతో దిగ్గజ ప్రముఖులతో ముఖా ముఖీ భేటీలు జరుపుతారు.
ఒడిషాలో పెట్టుబడులు పెట్టేందుకు ఏమి అనుకూలంగా ఉన్నాయో వారికి విడమరచి చెబుతారు. ఈ సెషన్ పూర్తి అయ్యాక ఈవెనింగ్ మెగా షోలో ఒడిషా పొటెన్షియాలిటీ మీద బిజినెస్ సెక్షన్ కి పూర్తి అవగాహన ఉండేలా అన్నీ విషయాలూ తెలియచేస్తారు.
ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, టెక్స్‌టైల్ రంగాల్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఒడిశా వైపు ఆకర్షించడంపై దృష్టి సారించనున్నట్లు ఒడిషా అధికారులు చెబుతున్నారు.
ఇలాంటి పెట్టుబడిదారుల రోడ్‌షోలను ఇప్పటికే నవీన్ పట్నాయక్ దుబాయ్, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరులో నిర్వహించారని, అక్కడ ఆయన పాల్గొని ఒడిషా వైపుగా ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళించేలా వారితో చర్చలు జరిపోఅరని అధికార వర్గాలు తెలిపాయి.
మొత్తానికి ఒడిషా సీఎం చాలా దూకుడు మీద ఉన్నారు. అందరూ రాబోతున్న ఎన్నికలు , పార్టీ రాజకీయాలు, కొత్తగా జాతీయ పార్టీలు అంటూ హడావుడి పడుతున్న వేళ పొరుగు రాష్ట్ర సీఎం తన స్టేట్ గురించి ఆలోచిస్తూ నాన్ పొలిటికల్ అజెండాతో ముందుకు సాగడం నిజంగా మెచ్చతగినదే. జనాలకు దీని వల్ల ఎంతో మేలు జరుగుతుంది అని అంతా అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.