Begin typing your search above and press return to search.

సిద్ధూ డబ్బు కోసం అమ్మనే వదిలేశాడు.. చెల్లెలు కఠిన నిజాలు

By:  Tupaki Desk   |   28 Jan 2022 1:53 PM GMT
సిద్ధూ డబ్బు కోసం అమ్మనే వదిలేశాడు.. చెల్లెలు కఠిన నిజాలు
X
పంజాబ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సిద్ధూపై బాంబు పేలింది. ప్రత్యర్థులు అదును చూసి సిద్దూనే సెంటిమెంట్ గా దెబ్బకొట్టారు. పంజాబ్ లో పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా ఆయనకు ఎదురులేదు అని అంతా అనుకుంటున్న వేళ.. సోదరి సంచలన ఆరోపణలు చేశారు. సిద్దూకు డబ్బులే ముఖ్యం అని.. పేరెంట్ బాగోగులు కూడా పట్టవు అని విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.

సిద్దూ సోదరి సుమన్ టూర్ అమెరికాలో నివసిస్తున్నారు. అక్కడి నుంచే మీడియాలో మాట్లాడారు. సిద్దూ డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టారని ఆరోపించారు. చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నామని.. తల్లి నాలుగు నెలల పాటు ఆస్పత్రిలో ఉందన్నారు. సిద్దూ అసలు పట్టించుకోలేదని కామెంట్ చేశారు. ఇవి అసత్య ఆరోపణలు కావని.. వీటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా తన వద్ద ఉన్నాయని కన్నీళ్లను అదిమి పట్టుకుంటూ రోదించింది.

ఆస్తుల కోసం తమతో సంబంధాలను తెంచుకున్న క్రూరమైన వ్యక్తి సిద్ధూ అని సిద్దూ సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1986లో తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని దిక్కులేని స్థితిలో వదిలేశాడని ఆమె వాపోయింది. ఆ తర్వాత తల్లి 1989లో ఒక అనాథ మహిళగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో చనిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

1987లో ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సిద్దూ తల్లిదండ్రుల గురించి అసత్యాలే చెప్పాడని అతడి సోదరి సుమన్ ఆరోపించింది.

గత జనవరి 20న సిద్దూని కలవడానికి పంజాబ్ వెళ్లాలనని.. కనీసం తలుపులు కూడా తీయలేదని సుమన్ టూర్ ఆరోపించారు. తనను చాలా సేపు ఇంటి బయటే నిలబెట్టి అవమానించాని సోదరి సుమన్ ఆరోపించారు.

తన వయసు 70 ఏళ్లు అని.. సోదరుడు సిద్దూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సుమన్ వాపోయింది. చనిపోయిన తన తల్లికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని సుమన్ ఆరోపించారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్న వేళ సిద్దూ సోదరి చేసిన ఆరోపణలు పంజాబ్ కాంగ్రెస్ ను షేక్ చేశాయి. విపక్షాలకు మంచి అస్త్రం దొరికినట్టైంది. మరి దీనిపై సిద్దూ ఏవిధంగా స్పందిస్తాడో వేచిచూడాలి.