Begin typing your search above and press return to search.
పార్లమెంట్ లోనే బెదిరించాడు.. ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం
By: Tupaki Desk | 23 March 2021 12:03 PM ISTమహారాష్ట్రలోని ఉద్దవ్ సర్కార్ పై మాట్లాడినందుకు పార్లమెంట్ సాక్షిగా బెదిరింపులు ఎదురయ్యాయని స్వతంత్య్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా సంచలన ఆరోపణలు చేశారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి ఎదుట బాంబు పేలుడు వ్యవహారంలో నిందితులతో మహారాష్ట్ర మంత్రులకు లింకులు ఉన్నాయని ఆరోపించినందుకు తనను శివసేన ఎంపీ సావంత్ బెదిరించాడని ఆమె ఆరోపించింది.
పార్లమెంట్ చరిత్రలోనే అరుదైన సంఘటనగా ఎంపీ నవనీత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. లోక్ సభ లాబీలో తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరిస్తూ సదురు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్ ఫిర్యాదు చేశారు. మోడీ, అమిత్ షా, ప్రహ్లాద్ జోషిలకు ఫిర్యాదు లేఖలు పంపారు.
మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ తనను లోక్ సభ లాబీలోనే బెదిరించాడని నవనీత్ ఆరోపించింది. మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తానంటూ ఆయన కన్నెర్రజేశాడని వివరించారు. జైల్లో పడేస్తానని బెదిరించాడని పేర్కొంది. ఈ బెదిరింపులు మొత్తం మహిళా లోకానికే అవమానం అని.. వీలైనంత త్వరగా సావంత్ పై చర్యలు తీసుకోండని స్పీకర్ కు రాసిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
మహారాష్ట్ర మంత్రులతో క్రిమినల్ పోలీసుతో లింకుందని.. ఫడ్నవీస్ సర్కార్ పక్కనపెట్టిన అధికారులను ఠాక్రే సీఎం అయ్యాక మళ్లీ తీసుకొచ్చిందని.. మంత్రి దేశ్ ముఖ్ నిందితుడేనని ఎంపీ నవనీత్ లోక్ సభలో ఆరోపించారు.