Begin typing your search above and press return to search.
ఇండియన్ క్రికెటర్ ను నరబలి ఇచ్చారు
By: Tupaki Desk | 17 Nov 2015 7:15 AM GMTనరబలులు - చేతబడులు - క్షుద్రపూజలు వంటి మూఢ నమ్మకాలు ఆఫ్రియా దేశాల్లో సాధారణమైపోయాయి. అభివృద్ధి చెందిన దేశం దక్షిణాఫ్రికాలోనూ ఇంకా నరబలులు జరుగుతూనే ఉన్నాయి. అయితే... తాజా దారుణంలో భారత సంతతికి చెందిన ఓ క్రికెటర్ నరబలికి గురవడం విషాదం. ప్రాణస్నేహితుడే అతడిని బలివ్వడం ఇంకా దారుణం.
భారత సంతతికి చెందిన నవాజ్ ఖాన్(23) మంచి క్రికెటర్... అయితే, అతనికి కొంత మానసిక వైకల్యం కూడా ఉంది.
వైకల్యం ఉన్నా క్రికెట్ లో మాత్రం అతను అద్బుతంగా రాణిస్తున్నాడు. నవాజ్ కు తండోవాఖే డుమా(21) అనే స్నేహితుడున్నాడు. డుమాను నవాజ్ ప్రాణస్నేహితుడుగా భావిస్తాడు. అయితే.. డుమా మాత్రం స్నేహం ముసుగులో నవాజ్ ను నరబలి ఇచ్చాడు. నాటు వైద్యం చేసే డుమాకు కొన్ని సమస్యలు ఉండడంతో ఓ భూత వైద్యుడిని కలిశాడు... మనిషి తలను తెస్తే నీ సమస్యలు తీరుతాయని ఆ భూత వైద్యుడు చెప్పడం డుమా నవాజ్ పై కన్నేశాడు. మరో ఇద్దరితో కలిసి నవాజ్ కు మాయమాటలు చెప్పి తన ఇంటి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ కత్తితో నవాజ్ తల తెగ్గోశాడు. స్నేహితుడు చేసిన నయవంచనకు నవాజ్ బలయిపోయాడు.
కాగా నవాజ్ ప్రతిభావంతుడైన క్రికెటర్. 2013 ఏడాదికి ఉత్తమ వికలాంగ క్రికెటర్ అవార్డు కూడా అందుకున్నాడు. హషీం ఆమ్లా చేతులు మీదుగా ఆ అవార్డు అందుకున్న నవాజ్ ఆ సంగతిని ఎప్పుడూ గొప్పగా చెప్పుకొనేవాడు.