Begin typing your search above and press return to search.

ప‌ద‌వి పోయిన ప్ర‌ధాని పోస్ట్ న‌వాజ్ ఇంట్లోనే..!

By:  Tupaki Desk   |   30 July 2017 5:06 AM GMT
ప‌ద‌వి పోయిన ప్ర‌ధాని పోస్ట్ న‌వాజ్ ఇంట్లోనే..!
X
అక్ర‌మాస్తులు.. అవినీతి ఆరోప‌ణ‌లు నిజ‌మై పాక్ ప్ర‌ధాని ప‌ద‌వికి అన‌ర్హుడిగా ఆ దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పుతో న‌వాజ్ ష‌రీఫ్ పీఎం పోస్ట్‌ను పోగొట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. న‌వాజ్ కు ప‌ద‌వి పోయినా.. పీఎం పోస్ట్ మాత్రం ఆయ‌న ఇంటి నుంచి పోలేద‌ని చెప్పాలి. ముందుగా వెల్ల‌డైన అంచ‌నాలకు త‌గ్గ‌ట్లే సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో న‌వాజ్ ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి వైదొలిగారు. అదే స‌మ‌యంలో ఆయ‌న సోద‌రుడు.. ప్ర‌స్తుతం పంజాబ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ష‌హీద్ ఖక్క‌న్‌ అబ్బాసీ పాక్ అపద్ధ‌ర్మ ప్ర‌ధానిగా ఎంపిక‌య్యారు. ఎంపీగా ఎన్నిక‌య్యే వ‌ర‌కూ ఆయ‌న అప‌ద్ధ‌ర్మ ప్ర‌ధానిగా కొన‌సాగ‌నున్నారు. అయితే.. ఎంపీ కావ‌టానికి ఆయ‌న‌కు 45 రోజుల స‌మ‌యం ఉంద‌ని చెప్పాలి. ఈ స‌మ‌యం లోపు ఎంపీగా ఎన్నికైతే.. ప్ర‌ధానిగా కొన‌సాగే వీలు ఉంది.

ప‌నామా ప‌త్రాల కుంభ‌కోణానికి సంబంధించి న‌వాజ్ ష‌రీఫ్ ఎన్నిక‌ల సంఘానికి త‌ప్పుడు వివ‌రాలు స‌మ‌ర్పించార‌ని పాక్ సుప్రీంకోర్టు ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప‌ద‌వి పోగొట్టుకున్న న‌వాజ్‌.. త‌న సోద‌రుడికి త‌న పోస్ట్‌ను అప్ప‌జెప్పారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ష‌రీఫ్ ఆయ‌న పిల్ల‌ల‌పైనా అవినీతి కేసులు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే.. న‌వాజ్ పై విధించిన అన‌ర్హ‌త వేటు ఎంత కాలం ఉంటుంది? ఆయ‌న తిరిగి రాజ‌కీయాల్లోకి రావ‌టం సాధ్య‌మేనా? అన్న అంశంపై న్యాయ‌నిపుణులు.. రాజ‌కీయ విశ్లేష‌కులు.. ప్ర‌జ‌ల్లో ఈ అంశంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఈ అంశంపై న్యాయ‌నిపుణులు కూడా ఒక అంచ‌నాకు రాలేక‌పోతున్న‌ట్లుగా చెబుతున్నారు.

న‌వాజ్ పై సుప్రీం విధించిన అన‌ర్హ‌త శాశ్విత‌మేన‌ని పాక్ బార్ కౌన్సిల్ స‌భ్యులు చెబుతుండ‌గా.. ఇది తాత్కాలిక‌మేన‌ని మాజీ న్యాయ‌మూర్తులు పేర్కొన‌టం గ‌మ‌నార్హం. 62 (1) (ఎఫ్‌) ప్ర‌కారం అన‌ర్హ‌త ఎదుర్కొంటున్న వారిపై ఎంత‌కాలం అనే అంశంపై స్ప‌ష్ట‌త లేద‌ని చెబుతున్నారు. 2012లో యూసుఫ్ ర‌జా గిలానీపై ఆర్టిక‌ల్ 63 ప్ర‌కారం అన‌ర్హ‌త వేటు వేసిన విష‌యాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. న‌వాజ్ పై ప‌డిన అన‌ర్హ‌త వేటు వేయ‌టం ద్వారా సుప్రీంకోర్టు అవినీతి ప‌రుల‌కు గ‌ట్టి హెచ్చ‌రిక పంపిన‌ట్లుగా పాక్ మీడియా వ్యాఖ్యానిస్తోంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పాక్ రాజ‌కీయ చిత్రాన్ని స‌మూలంగా మార్చేసింద‌న్న అభిప్రాయాన్ని పాక్ మీడియా వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌ధాని ప‌ద‌విలో ఉన్న న‌వాజ్ పై అన‌ర్హ‌త వేటు వేసిన సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల ధైర్యాన్ని పాక్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషార్ర‌ఫ్ హ‌ర్షం వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌న‌రా్హం. న‌వాజ్‌.. ఆయ‌న పిల్ల‌లు దేశం విడిచిపారిపోయే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే వారు ఎక్క‌డికి వెళ్ల‌కుండా ఆంక్ష‌లు విధించాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా.. న‌వాజ్ పై అన‌ర్హ‌త వేటు వేయ‌టంలో పాక్ మిల‌ట‌రీ నాయ‌క‌త్వం గుర్రుగా ఉండ‌టం కార‌ణంగా చెప్పొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మిల‌ట‌రీ.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లు సంయుక్తంగా ప‌న్నిన కుట్రలో భాగంగానే తాజా తీర్పు వెలువ‌డింద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంత‌ర్జాతీయంగా ఏకాకి అవుతున్న పాక్‌ను కాపాడేందుకు న‌వాజ్ చేసిన ప్ర‌య‌త్న‌మే ఆయ‌న ప‌ద‌వి పోవ‌టానికికార‌ణంగా మారింద‌ని చెబుతున్నారు. శాంతి దూత‌గా పేరున్న న‌వాజ్ భార‌త్ తో ఉద్రిక్త‌త‌లు త‌గ్గించుకునే దిశ‌గా అడుగులు వేయ‌టం.. వాణిజ్య సంబంధాల్ని మెరుగుప‌ర్చుకునేందుకు.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడి పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది న‌చ్చ‌క‌నే మిల‌ట‌రీ కుట్ర జ‌రిపి తాజా ప‌రిణామాల‌కు కార‌ణ‌మైంద‌న్న భావ‌న ప‌లువ‌రిలో వ్య‌క్తం కావ‌టం గ‌మ‌నార్హం. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో పాక్ రాజ‌కీయంలో మ‌రికొన్ని కీల‌క మార్పులు చోటు చేసుకోవ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.