Begin typing your search above and press return to search.

అసదుద్దీన్ కు ఇప్పటికైనా సిగ్గురావాలి

By:  Tupaki Desk   |   20 March 2016 9:12 AM GMT
అసదుద్దీన్ కు ఇప్పటికైనా సిగ్గురావాలి
X
భారత్ లో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటిగా ఎదగాలన్న తాపత్రయంతో ఓ వర్గాన్ని ఆకట్టుకునే లక్ష్యంతో రెచ్చగొట్టే, పరిధి దాటి కామెంట్లు చేసే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ఊహించని షాక్ తగిలింది. భారత్ మాతాకీ జై అని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనబోనని చెప్పిన అసద్ దాన్నో గొప్ప విషయంగా భావిస్తూ పదేపదే దాన్ని సమర్థించుకుంటున్నారు. దానిపై ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా మరింత రెచ్చగొట్టేలానే మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. అసద్ పార్టీ ఎంతగానో అభిమానిస్తుందని చెప్పుకొనే పాకిస్థాన్ కు చెందిన వారు కూడా ఆయన వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ కుమార్తె మరియా తాజాగా అసద్ కు గట్టి షాక్ ఇచ్చారు. ఇంతకాలం భారతదేశంలో ఉంటూ భారత్ మాతాకీ జై అనని వారు పాకిస్థాన్ కు ఎందుకని ప్రశ్నించారు. భారత్ కే పనికిరాని వారు పాకిస్థాన్ కు ఎందుకని వ్యాఖ్యానించారు. భారతీయులు కూడా అలాంటివారిని పాకిస్థాన్ పంపేస్తామని చెప్తున్నారని, అలాంటివారు పాకిస్థాన్ కు అవసరం లేదన్న సంగతి గ్రహించాలని సూచించారు. నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..ఆమె తన ఉద్దేశాన్ని ట్వీట్ చేయడంతో పాకిస్థాన్ లోనూ వివాదస్పదమయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మరియం మాటలు ఓవైసీకి గట్టి షాక్ ఇచ్చినట్లేనని చెప్పుకోవాలి. సొంత దేశాన్ని అభిమానించనివాడు వేస్టు అన్నట్లుగా ఆమె మాట్లాడారు.

మరోవైపు ఈ వివాదంపై భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'భారత్‌మాతాకి జై' అన్న నినాదంపై వివాదమేమి లేదని, ఈడెన్‌ గార్డెన్‌ లో ప్రజల హర్షధ్వానాలే అందుకు నిదర్శనమని అరుణ్‌ జైట్లీ అన్నారు అంశాలపై విభేదించేందుకు రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, దేశం నుంచి విడిపోతామంటే రాజ్యాంగం ఒప్పుకోదని స్పష్టం చేశారు. ఇదంతా ఎలా ఉన్నా మారియా వ్యాఖ్యలు విన్న తరువాత అయినా అసదుద్దీన్ కు సిగ్గొస్తుందో లేదో చూడాలి.