Begin typing your search above and press return to search.
పాక్ లో సంచలనం..మాజీ ప్రధానికి పదేళ్ల జైలు
By: Tupaki Desk | 6 July 2018 1:51 PM GMTపొరుగుదేశమైన పాకిస్థాన్ లో అనూహ్యమైన తీర్పు వచ్చింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో ఆయనకు ఈ శిక్షను ఖరారు చేశారు. షరీఫ్ కూతురు మరియం నవాజ్‌కు కూడా ఏడేళ్ల శిక్షను వేశారు. అవెన్ ఫీల్డ్ అవినీతి కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో వేసిన పిటిషన్ ఆధారంగా ఈ శిక్షను ఖరారు చేశారు. ఎన్‌ఏబీ విచారణకు సహకరించిన కారణంగా కూడా షరీఫ్ కు ఏడాది జైలు శిక్షను విధించారు. షరీఫ్ అల్లుడు కెప్టెన్ సఫ్ దార్ కు కూడా అకౌంటబులిటీ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది.
ఇదే కేసులో షరీఫ్ కు 8 మిలియన్ పౌండ్ల జరిమానా కూడా విధించారు. ఆయన కూతురు మరియంకు మరో 2 మిలియన్ల పౌండ్ల జరిమానా వేశారు. ఆ మొత్తం డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్లనుంది. ప్రస్తుతం షరీఫ్ కుటుంబానికి చెందిన నలుగురూ లండన్ లోనే ఉన్నారు. అల్లుడు కెప్టెన్ సఫ్ దార్ మాత్రం పాక్ లో ఉన్నారు. లండన్ లోని అవెన్ ఫీల్డ్ లో ఉన్న షరీఫ్.. అక్కడ టీవీ ద్వారా కోర్టు తీర్పును ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన భార్యకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఇవాళ ఉదయం ఈ కేసులో తీర్పును వెలువరించాల్సి ఉంది. కానీ అయిదుసార్లు తీర్పును వాయిదా వేశారు. చివరగా సాయంత్రం 4.30 నిమిషాలకు తీర్పును వెల్లడించారు. తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేయాలని అకౌంటబులిటీ కోర్టుకు షరీఫ్ ఫ్యామిలీ పిటీషన్ పెట్టుకున్నది. కానీ ఇవాళ ఉదయం ఆ అభ్యర్థనను తోసిపుచ్చారు.
కాగా, కొద్దికాలం క్రితం పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఉన్న కేసుల విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఇజాజ్ ఉల్ ఎహసాన్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పనామా పేపర్స్ కేసులో ఉన్న షరీఫ్ ను జీవితకాలం ఎన్నికల్లో నిలబడకుండా నిషేధించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఈ న్యాయమూర్తి ఇజాజ్ ఎహసాన్ కూడా ఉన్నారు. లాహోర్ లోని మోడల్ టౌన్ లో ఉన్న ఇజాజ్ ఇంటిపై జరిగిన ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఉదయం 4.30 - 9 గంటల ప్రాంతంలో రెండుసార్లు ఈ కాల్పులు జరిగినట్లు సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటన జరిగిన వెంటనే పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ మియాన్ సాకిబ్ నిసార్.. ఆ జడ్జి ఇంటికి వెళ్లారు. పంజాబ్ ఐజీ ఆరిఫ్ నవాజ్ ఖాన్ కు సమన్లు జారీ చేశారు. చీఫ్ జస్టిసే పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఫోరెన్సిక్ నిపుణులు ఘటన జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు.