Begin typing your search above and press return to search.
విజయ్ మాల్యా బాటలో నవాజ్ షరీఫ్
By: Tupaki Desk | 17 April 2016 10:57 AM GMTప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పనామా పత్రాల్లో బయటపెట్టినవన్నీ సత్యాలని అర్తమవుతోంది. తాజాగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ దేశాన్ని విడిచి వెళ్లారు. ఆయన మూడు రోజుల్లో తిరిగొస్తారని చెబుతున్నా దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో ఆయన కుమార్తె మరియం షరీఫ్ ప్రధాని కావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పనామా పత్రాల్లో నవాజ్ షరీఫ్ - ఆయన కుటుంబసభ్యుల పేర్లు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాక్ లో ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. మీడియా కూడా ముప్పేట దాడి చేస్తోంది. విపక్షాలూ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ విమర్శల నుంచి బయటపడడానికి ఆయన హార్ట్ టెస్టుల కోసమంటూ లండన్ ప్రయాణమయ్యారు. మూడు రోజుల పర్యటన అని చెబుతున్నారు. అయితే... పాక్ మీడియాలో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన తిరిగి అప్పుడే రాకపోవచ్చని... ఆయన స్థానంలో ఆయన కుటుంబ సభ్యులు పీఠమెక్కుతారని వినిపిస్తోంది. ముఖ్యంగా షరీఫ్ కుమార్తె అధికారం అందుకుంటారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
అయితే... దేశంలో ఇలాంటి అనిశ్చితి ఏర్పడడంతో మళ్లీ సైనిక తిరుగుబాటు జరిగినా జరగొచ్చన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.