Begin typing your search above and press return to search.
హిందువులపై పాక్ అధ్యక్షుడి షాకింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 12 Nov 2015 8:40 AM GMTపాకిస్తాన్-భారతదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనేది వాస్తవం. నరేంద్రమోడీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకీస్తానీలు మరింత ద్వేషం పెంచుకున్నారు. ఈ మేరకు భారత్ కు వ్యతిరేకంగా అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్ లోని వారితో పాటు ఆ దేశ ప్రజా ప్రతినిధులు సైతం తమ అక్కసును వెళ్లగక్కుతుంటారు. అయితే ఇందుకు భిన్నంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు.
దీపావళి పర్వదినం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో నవాజ్ ప్రసంగిస్తూ హిందువులకు తాను అండగా నిలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందూ మతానికి చెందిన వారితో మాట్లాడుతూ మైనారిటీలకు తమ ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తుందని హామీ ఇచ్చారు. తమ మతం అణచివేతకు గురయ్యే వారికి, బలహీనులకు అండగా ఉండాలని చెబుతుందని అంతేకాదు.... వాస్తవానికి అన్ని మతాలూ ఇదే విషయాన్ని చెబుతాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్ లో ఉన్నవారందరూ తమ దేశానికి చెందినవారేనని, ముస్లింలు హిందువుల పండుగల్లో, ఆనందోత్సాహాల్లో పాలుపంచుకోవాలని, అలాగే హిందువులు కూడా ముస్లింల పండుగల్లో పాలుపంచుకోవాలని సూచించారు. మత వివక్షపై తనకు నమ్మకం లేదని, ప్రతి పౌరుడికీ సమాన హక్కులున్నాయని ఆయన స్పష్టం చేశారు. హిందువులను అణచివేతకు గురి చేసే వ్యక్తి ముస్లిం అయినాసరే తాను అతడిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇవండి. పాకిస్తాన్ అధ్యక్షుల వారు ఆ దేశంలో ఉన్న హిందువుల కోసం ఇచ్చిన హామీలు. ఇదంతా జరిగే పనేనా అనుకుంటున్నారా? కాలాం సమాధానం చెప్తుంది కదా. వేచి చూద్దాం.