Begin typing your search above and press return to search.

నవాజ్ షరీఫ్ నాలుక మెత్తబడుతోంది

By:  Tupaki Desk   |   31 Dec 2015 11:17 AM GMT
నవాజ్ షరీఫ్ నాలుక మెత్తబడుతోంది
X
ప్రధాని మోడీ దౌత్యంలో చూపుతున్న దూకుడు భారత్ - పాకిస్థాన్ ల మధ్య కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా... చిరకాల శత్రుత్వాన్ని వీడి స్నేహం చిగురించనుందా? అంటే అవుననే అనిపిస్తున్నాయి పరిస్థితులు. పాకిస్థాన్ ప్రధాని తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఆ దేశంలోనూ మోడీ ప్రభావం తీవ్రంగా ఉందని... పాకిస్థాన్ కూడా తన ఘర్షణాత్మక ధోరణిని విడనాడి స్నేహం కోసం రాక తప్పని పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. నవాజ్ షరీఫ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''ఇండియా - పాకిస్థాన్ లు ఇకపై శత్రువులుగా బతికే పరిస్థితులు లేవు'' అని అన్నారు. పాక్ దినపత్రిక డాన్ తో ఆయన మాట్లాడుతూ ''అన్ని రకాల అంశాలను వివాదాలను చర్చలతో పరిష్కరించుకునేందుకు ఇండియాను ఆహ్వానిస్తున్నాను... ఇక ఇరుగుపొరుగు దేశాలు శత్రువులని భావిస్తే బతకలేం.'' అని ఆయన పేర్కొన్నారు.

చైనా - పాకిస్థాన్ ల ఎకనామిక్ కారిడార్ శంకుస్థాపన సందర్భంగా పాక్ పత్రిక డాన్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పాక్ - ఇండియాలు ఇకపై శత్రువులు కావని చెప్పారు. అంతేకాదు... భారత అధికారులతో నిత్యం సంభాషిస్తుండాలని తమ అధికారులతో చెప్పానని కూడా షరీఫ్ అన్నారు.

మొత్తానికి మోడీ హఠాత్ పర్యటన షరీఫ్ ఆలోచనాధోరణిలో చాలామార్పు తెచ్చినట్లుగా కనిపిస్తోంది. మోడీ తన పుట్టిన రోజు నాడు వచ్చి బహుమతిగా ఇచ్చిన తలపాగాను కూడా షరీఫ్ ఇటీవల తన మనవరాలి పెళ్లిలో ధరించారు. ఇప్పుడు ఇండియాతో శత్రువుగా ఉండలేనని అంటున్నారు.