Begin typing your search above and press return to search.
మోడీ నీ ఫ్రెండ్ ఎలాంటోడో తెలిసిందా?
By: Tupaki Desk | 1 March 2016 4:26 AM GMTఫ్రెండ్ పుట్టినరోజు అని.. ప్రోటోకాల్ ను పక్కన పెట్టి.. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వేరే దేశానికి వెళ్లి అందరిని విస్మయపరిచారు ప్రధాని మోడీ. దాయాది దేశాధినేతతో ఇంత ఫ్రెండ్ షిప్పా అని ఫీలైనోళ్లు కొంతమంది అయితే.. మెచ్చుకున్నోళ్లు మరికొంతమంది. పాకిస్థాన్ కు మోడీ అంత ఆకస్మాత్తుగా ఎందుకెళ్లారన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆయన వెళ్లటానికి కారణమైన వ్యక్తి ఎలాంటోడన్న విషయానికి సంబంధించి ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.
ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాకు వణుకు పుట్టించి.. తన ఉగ్రవాదంతో ప్రపంచానికి షాకుల మీద షాకులిచ్చిన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తో పాక్ ప్రధాని నవాజ్ షరీప్ కు ఉన్న దోస్తానా ఎంతటిదన్న విషయం బయటకు వచ్చింది. ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. 1990 ఎన్నికల్లో బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీని ఓడించేందుకు లాడెన్ దగ్గర నుంచి ఆర్థిక సాయాన్ని పొందినట్లుగా సదరు పుస్తకం పేర్కొంది.
‘‘ఖలీద్ ఖ్వాజా; షహీద్ – ఇ- అమమ్ అనే పుస్తకంలో షరీఫ్ కు సంబంధించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తాను కానీ పాక్ ప్రధానిని అయితే ఇస్లామిక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తానంటూ షరీఫ్ చెప్పిన మాటలకు ప్రభావితమైన లాడెన్.. పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చినట్లుగా షమామా తన పుస్తకంలో వెల్లడించారు. పాకిస్థాన్ లోని అపర కుబేరుల్లో ఒకరైన షరీఫ్.. ఎన్నికల ఖర్చులకు సంబంధించి నిధులు సేకరించటానికి పలువురిని సాయం కోరటం ఒకటైతే.. తాను ఫ్రెండ్ గా ఫీలయ్యే వ్యక్తికి సంబంధించిన విషయాల్ని తెలుసుకొని.. అందుకు తగ్గట్లు మెలగాల్సిన అవసరం ఉంది. అయినా.. ఉగ్రవాదులతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన వ్యక్తితో ఫ్రెండ్ షిప్ ఏమిటి మోడీ?