Begin typing your search above and press return to search.
కశ్మీర్‌లో జిహాద్..కారకుడు ఈయనే
By: Tupaki Desk | 9 May 2017 1:25 PM GMTభారత నియంత్రణ రేఖను ఆనుకొని అనేక రాష్ర్టాలు ఉన్నప్పటికీ ఒక్క జమ్మూకశ్మీర్‌లోనే ఎందుకు నిత్యం అల్లకల్లోలం జరుగుతోంది? అల్లరిమూకలు చెలరేగిపోవడం, ప్రభుత్వాలను శాసించే స్థాయికి వారి ధైర్యం రావడం వెనుక మర్మం ఏమిటి? జిహాదీలకు ఎక్కడ బీజం పడింది. ఇలాంటి ఎన్నో సందేహాలకు తాజాగా క్లారిటీ వచ్చింది. కశ్మీర్‌లో జిహాదీలకు ఎవరు సాయం చేస్తున్నారో తెలిసిపోయింది. అల్ ఖైదా మాజీ నేత ఒసామా బిన్ లాడెన్ ఇదంతా చేశాడని తేలింది.
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు డబ్బు ఇచ్చిన ఒసామాబిన్ లాడెన్ కశ్మీర్‌లో జిహాద్‌ను ప్రోత్సహించాడని పాక్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. నవాజ్ షరీఫ్‌పై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేస్తామని ఇమ్రాన్ పార్టీ తెహ్రీకె ఇన్సాఫ్ (పీటీఐ) స్పష్టంచేసింది. దేశంలో అస్థిరత నెలకొనేలా చేయడానికి నవాజ్ షరీఫ్.. ఓ విదేశీ వ్యక్తి నుంచి నిధులు తీసుకున్నారని పీటీఐ అధికార ప్రతినిధి ఫవద్ చౌదరీ ఆరోపించారు. 2010లో పాక్ తాలిబన్ చేతిలో హత్యకు గురైన మాజీ ఐఎస్ఐ గూఢచారి ఖాలిద్ ఖవాజాపై అతని భార్య రాసి పుస్తకంలో దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పీటీఐ వెల్లడించింది.
ఈ బుక్‌లో ఉన్న ఆధారాల ప్రకారం అక్‌ఖైదా మాజీ చీఫ్ ఒసాబా బిన్ లాడెన్ నుంచి నవాజ్ షరీఫ్ రూ.150 కోట్లు తీసుకున్నట్లు ఇమ్రాన్‌ఖాన్ ఆరోపిస్తున్నారు. కశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్‌లలో జిహాద్‌ను ప్రమోట్ చేయడానికి షరీఫ్ ఈ డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 1989లో ఈ డబ్బులో నుంచే రూ.2.7 కోట్లు ఖర్చు పెట్టి అప్పటి బెనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని కూల్చడానికి షరీఫ్ ప్రయత్నించారని ఇమ్రాన్ ఆరోపించారు. గతంలో అనే ప్రభుత్వాలపై కుట్రలు చేయడంలో షరీఫ్ క్రియాశీలకంగా వ్యవహరించారని పీటీఐ పేర్కొంది.