Begin typing your search above and press return to search.
భారతీయులంతా ఉడికిపోయే మాటన్నపాక్!
By: Tupaki Desk | 17 Aug 2016 5:25 AM GMTమాటకు మాటే సమాధానంగా పాకిస్థాన్ భావిస్తున్నట్లుంది తాజా పరిణామాలు చూస్తుంటే. దాయాది కుటిల యత్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తప్పు పడుతూ వారికి చురుకుపుట్టేలా చేసిన వ్యాఖ్యకు రియాక్షన్ అన్నట్లుగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారతీయులంతా ఒళ్లు మండిపోయేలా వ్యాఖ్యలు చేశారు. పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ.. పాక్ తీరును తప్పు పట్టటమే కాదు.. బలూచిస్థాన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పరిస్థితులపై స్పందించిన విషయం తెలిసిందే. అక్కడి మానవ హక్కుల హననాన్ని ప్రస్తావించటమే కాదు.. వారికి తమ మద్ధతు ఉంటుందన్న విషయాన్ని మోడీ స్పష్టంగా వెల్లడించారు.
ఇప్పటివరకూ భారత ప్రధానుల నుంచి ఇలాంటి స్పందనను చూడని నవాజ్ షరీఫ్.. మోడీ మాటకు ప్రతి మాట అన్నట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీ ప్రజల దుస్థితిని ప్రపంచం పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన.. కశ్మీరీ ప్రజల స్వాంత్ర్యోద్యమానికి తమ ప్రభుత్వం నైతిక.. దౌత్య.. రాజకీయ మద్దతు ఇస్తుందంటూ భారతీయులంతా ఒళ్లు మండిపోయే మాటను మాట్లాడారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ కు చెందిన పాక్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ గెలిచిన నేపథ్యంలో.. పీవోకే ప్రధానిగా రాజా ఫరూక్ హైదర్ ను.. అధ్యక్షుడిగా మసుద్ ఖాన్ ను నియమించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడితో భేటీ అయిన నవాజ్ షరీఫ్ కశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాన్ని తన ఆగస్టు 15 వేడుకల సందర్భంగా మోడీ విమర్శించిన నేపథ్యంలో.. అందుకు ప్రతిగా అన్నట్లు మోడీ తాజా వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది. ఏమైనా తాజాగా పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య మరింత వేడి పుట్టటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. పాక్ ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో మోడీ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఉత్కంట రేపుతోంది.