Begin typing your search above and press return to search.

తుమ్మ‌ల, నాయిని ప‌క్కా... ఆ ఇద్ద‌రికే డౌట్‌

By:  Tupaki Desk   |   12 Dec 2018 2:53 PM GMT
తుమ్మ‌ల, నాయిని ప‌క్కా... ఆ ఇద్ద‌రికే డౌట్‌
X
టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ కాబోయే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో ఉత్కంఠ‌కు తెర‌లేపారు. రాజకీయ ఎత్తుగడలను సరిగ్గా అంచనా వేస్తు శాసనసభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయదుందుభి మోగించిన టీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సమయత్తమవుతున్నారు. డిసెంబర్ 11న ఫలితాల అనంతరంగవర్నర్ నరసింహన్‌ను కలిసి సీఎం కేసీఆర్ తన ప్రమాణస్వీకారం సమాచారాన్ని అందజేశారు. అయితే, ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ కొన‌సాగుతోంది. మంత్రివర్గంలో కొత్తగా చేరేవారు వీరేనంటూ ప్రచారం సాగుతున్న ప‌రంప‌ర‌లో కొత్త‌వారి పేరు వినిపిస్తున్న‌ప్ప‌టికీ.... పాత వారి సంగ‌తి ఏంట‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

కేసీఆర్ కేబినెట్లో న‌లుగురు ఓట‌మి పాల‌యిన సంగ‌తి తెలిసిందే. మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టున్నారు. అలాగే ములుగు అభ్యర్థి- మాజీ మంత్రి చందూలాల్- టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు- రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి ప్రాతినిథ్యం వహించిన మంత్రి మహేందర్ రెడ్డి... ఓటమి పాలయ్యారు. అయితే, వీరిలో ఒక్క‌రికి బెర్త్ ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓట‌మి పాల‌యిన తుమ్మ‌ల‌ను తిరిగి మంత్రివ‌ర్గంలోకి కేసీఆర్ తీసుకుఓవ‌చ్చున‌ని గులాబీవ‌ర్గాల స‌మాచారం. ఈ మేర‌కు ఇప్ప‌టికే ఆయ‌న‌కు స‌మాచారం అందింద‌ని చెప్తున్నారు.

కాగా, పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత అయిన నాయిని న‌ర్సింహారెడ్డి కి సైతం మంత్రి ప‌ద‌వి చాన్స్ ఇవ్వ‌వ‌చ్చంటున్నారు. పార్టీ కోరిక మేర‌కు ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు బెర్త్ ఖాయ‌మంటున్నారు. అయితే, ఈ రాత్రికి ఓ క్లారిటీ రావ‌చ్చ‌ని తెలుస్తోంది.మ‌రో ఇద్ద‌రు మంత్రులు అయిన జూప‌ల్లి కృష్ణారావు, మ‌హేంద‌ర్ రెడ్డి కి అవ‌కాశం త‌క్కువేన‌ని తెలుస్తోంది.