Begin typing your search above and press return to search.

జ‌గ‌నే సీఎం - ఇది నిజం - తెలంగాణ సీనియ‌ర్‌

By:  Tupaki Desk   |   28 Nov 2018 5:54 AM GMT
జ‌గ‌నే సీఎం - ఇది నిజం - తెలంగాణ సీనియ‌ర్‌
X
భ‌విష్య‌త్తు డిసైడ్ అయిపోయింద‌ట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉండ‌నున్నాయో జోస్యం చెప్పేశారు తెలంగాణ మాజీ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి. టిక్కెట్ రాక‌పోయినా టీఆర్ ఎస్ ర‌క్తం న‌ర‌న‌రానా జీర్ణించుకున్న నాయిని పార్టీ కోసం ఫుల్‌ గా ప్ర‌చారం చేస్తున్నారు. నిన్న హైద‌రాబాదులోని ఛ‌త్రినాక‌లో మాట్లాడిన నాయిని... ఇక్క‌డి కేసీఆర్ గెలుపును - అక్క‌డ జ‌గ‌న్ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌న్నారు. వ‌చ్చే ఏడాది ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అని ఆయన జోస్యం చెప్పారు. ఆంధ్రాలో తిర‌క్క‌పోయినా అక్క‌డి ప‌రిస్థితులు చంద్ర‌బాబు కంటే నాయినికి బాగానే అర్థ‌మైన‌ట్టున్నాయి. అందుకే గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారని ప‌లువురు అంటున్నారు. ఇప్ప‌టికే చాలా స‌ర్వేలు కూడా ఇదే విష‌యాన్ని చెప్పాయి.

బ‌హుశా నాయిని హోంమంత్రి కావ‌డం వ‌ల్ల ఇంటెలిజెన్స్ స‌మాచారం అందిందేమో మ‌రి. దీనిపై మ‌రింత సేపు మాట్లాడిన నాయిని చంద్రబాబు అడ్రస్ ఏపీలో గల్లంతు కావడం ఖాయమన్నారు. ఎన్నికల తరువాత ఏపీలో తెలుగుదేశం పార్టీకి చిరునామా కూడా ఉండదన్నారు. తెలంగాణ లో ప్ర‌జ‌ల‌కు క్లారిటీ ఉంద‌ని - 70 ఏళ్ల‌లో చూడని అభివృద్ధిని వారు నాలుగేళ్ల‌లో చూశార‌ని నాయిని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉంటే త‌న ఆట‌లు సాగ‌వ‌ని - అత‌నితో అభివృద్ధి పోటీ ప‌డ‌లేన‌ని భావించిన చంద్ర‌బాబు చేసిన‌ ప్రయత్నాలు ఫలించబోవన్నారు. కేసీఆర్ ను ఓడించడం సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌న్నారు. ఎంత మంది వచ్చినా గెలుపు కేసీఆర్‌దే అని వ్యాఖ్యానించారు. 24 గంట‌ల ఉచిత క‌రెంటు దేశంలో కేసీఆర్ సృష్టించిన చ‌రిత్ర అని ఆయ‌న అన్నారు. ఇదొక్క‌టి చాలు... కేసీఆర్ ఇత‌రుల‌కు అంద‌ని ఎత్తులో ఆలోచిస్తార‌ని చెప్ప‌డానికి అని అన్నారు.