Begin typing your search above and press return to search.
అమిత్ షా కార్పొరేటర్ ను కూడా గెలిపించలేడు
By: Tupaki Desk | 24 April 2017 12:49 PM GMTఉత్తరాది రాష్ర్టాలపై నజర్ వేసిన బీజేపీ.. తెలంగాణలో విస్తరించాలని భావిస్తూ ప్రణాళికలను రచించడాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్ పార్టీ ముందు అమిత్ షా ఎత్తులు పనిచేయవని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవని నాయిని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఇళ్లిల్లు తిరిగినా ఇప్పుడున్న దానికంటే అదనంగా ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేరని నాయిని నర్సింహారెడ్డి ఎద్దేవా చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మరో పదేండ్లపాటు టీఆర్ ఎస్ అధికారంలో ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని, ఉత్తమ్ కుమార్ గడ్డం ఆగకుండా పెరుగుతుందని నాయిని రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణపై తప్పుడు ప్రచారం చేసిన ప్రతిపక్షాలకు టీఆర్‌ఎస్‌ను విమర్శించే హక్కే లేదన్నారు. సభ్యత్వం విజయవంతం చేసిన తరహాలోనే వరంగల్ సభను విజయవంతం చేయాలని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రెండు లక్షల మందిని సభకు తీసుకుకెళ్లాలని కార్యకర్తలను నాయిని కోరారు. ఎండలతో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుని, ప్రతీ నియోజకవర్గం నుంచి పదివేల మందిని తరలించాలని కోరారు. కాగా, హైదరాబాద్ చిక్కడపల్లిలోని బాబా గ్రూప్స్ అధినేత పిడిశెట్టి ప్రభాకర్ ఇంట్లో తోటమాలిగా, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి హోటల్, పిస్తాహౌస్ లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పనిచేసి రూ.2.13 లక్షలు పాదించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/