Begin typing your search above and press return to search.
నాయిని మాటకు ఉలిక్కిపడ్డ 'తెలంగాణ భవన్'
By: Tupaki Desk | 3 Jun 2017 5:44 AM GMTఒక్కమాట.. ఒకే ఒక్క మాట ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పే ఘటన ఇది. ఎందుకొచ్చిందో.. ఎలా వచ్చిందో.. అసలు అలా రావటానికి ఛాన్సే లేకున్నా.. నాయిని నోటి నుంచి వచ్చిన మాట అక్కడున్న వారందరిని ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. అలా ఎలా పొరబడ్డారన్న సందేహం వచ్చేలా చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పురిటిగడ్డ లాంటి తెలంగాణ భవన్ దగ్గర రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నోటి నుంచి వచ్చిన అందరిని అవాక్కు అయ్యేలా చేసింది. చివరకు నాయిని సైతం ఫీల్ కావటం కనిపించింది. అసలేం జరిగిందంటే..
తెలంగాణ ఉద్యమంలో నాయిని కమిట్ మెంట్ ను క్వశ్చన్ చేయటానికి లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ ఎన్నో సంక్షోభాల్ని చూసింది. అయితే.. ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ వెంటే నిలబడ్డారు నాయిని. ఆ కారణంతోనే కావొచ్చు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఆయన ఏకంగా హోంమంత్రి స్థానాన్నే కట్టబెట్టారు.
అందుకు తగ్గట్లే నాయిని తన విధేయతను ప్రదర్శిస్తుంటారు. అలాంటి ఆయన.. తాజాగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ.. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన జెండావందనంలో పాల్గొన్నారు. జెండా ఎగురవేసిన అనంతరం మంత్రి నాయిని మాట్లాడారు.
పదేళ్లు టీఆర్ ఎస్ పార్టీనే అధికారంలోనే ఉంటుందని అనాల్సిన స్థానే.. టీడీపీ అధికారంలో ఉంటుందన్న మాట ఆయన నోటి నుంచి రావటంతో తెలంగాణ భవన్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కు అయ్యారు. ఆ వెంటనే తాను అన్న మాటలోని తప్పును గుర్తించిన నాయిని నాలుకర్చుకొన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని తన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అయితే.. నాయిని లాంటి నేత నోటి నుంచి వచ్చిన ఈ మాట అవాక్కు అయ్యేలా చేసిందనటంలో సందేహం లేదు. పొరపాట్లు సహజమే కానీ.. మరీ ఇంత పొరపాటా? అన్నది ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/