Begin typing your search above and press return to search.
తేడా వస్తే కేసీఆర్ ఏం చేస్తాడో చెప్పిన నాయిని
By: Tupaki Desk | 3 March 2017 8:15 AM GMTమనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పే తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గులాబీ దళపతి - ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ గా డాక్టర్ అయాచితం శ్రీధర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లోని స్టేట్ లైబ్రరరీ కార్యాలయంలో సీఎం ఓఎస్ డి దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. 'ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తెలివిగల వ్యక్తి. ఆయన రూల్స్ ప్రకారం నడుచుకుంటేనే సరి.. లేదంటే మన భవిష్యత్ డౌనే' అని వ్యాఖ్యానించారు.సీఎంకు అనుకూలంగా ఉంటేనే పదవులు వస్తాయని, లేకుంటే పరిస్థితి అంతేనని అన్నారు. రాజకీయాల్లో ఉన్నతస్థానాలకు చేర్చడంతోపాటు దించడమూ తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు.
అందులో భాగంగానే డాక్టర్ అయాచితం శ్రీధర్ కోరుకున్న పదవిని దక్కించుకున్నారని నాయిని నర్సింహారెడ్డి గుర్తు చేశారు. రాజకీయంగా ప్రాధాన్యం లేని పదవిని కోరుకున్నా శ్రీధర్ ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని నాయిని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కు ఎదురులేదని, అలా అని సీఎం తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని, ప్రజాస్వామ్య ధోరణిలో నిలదీయొచ్చని చెప్పారు. ఇటీవల సీఎం అస్తిత్వాన్ని దిగజార్చాలనే కుట్ర చేస్తున్నారని, ప్రజల విశ్వసనీయత ఉన్నంత కాలం టీఆర్ ఎస్ కు ఢోకా ఉండదన్నారు. అలా అని, పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోతే ఎవరూ కాపాడలేరని కూడా గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ గ్రహాలకు అనుకూలంగా మారిన గ్రంథాలయ చైర్మెన్ పదవి మొదటి సారిగా పుస్తకాన్ని ప్రేమించే వ్యక్తికి లభించడం చాలా గర్వించదగిన విషయమన్నారు. రాష్ట్రంలో గ్రంథాలయాలకు నూతన అధ్యాయం మొదలైందని చెప్పారు. గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివిన వారే రాజకీయ, ఆర్థిక, శాస్త్రవేత్తలుగా రాణించారని గుర్తు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/