Begin typing your search above and press return to search.
నయనతార దంపతులకు శిక్ష తప్పదా?
By: Tupaki Desk | 11 Oct 2022 3:30 PM GMTతమిళ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులకు ట్విన్స్ (కవల పిల్లలు) పుట్టిన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు అబ్బాయిలు జన్మించారని విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా వేదికగా సంతోషం ప్రకటించారు. అయితే జూలైలో వీరిద్దరి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన నాలుగు నెలల్లోనే పిల్లలు ఎలా జన్మించారా అనేదానిపై అంతా అయోమయంలో పడ్డారు. సరోగసీ (అద్దె గర్భం) విధానం ద్వారా వీరు బిడ్డలకు జన్మనిచ్చి ఉంటారని ఊహాగానాలు వస్తున్నాయి.
అయితే సరోగసీ విధానం ద్వారానే నయనతార, విఘ్నేశ్ శివన్ బిడ్డలను కని ఉంటే వారు చట్ట ప్రకారం చిక్కుల్లో పడక తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మనదేశంలో ఉన్న సరోగసీ చట్టాల ప్రకారం.. వివాహమై ఐదేళ్లు గడిచిన తర్వాత అప్పటికీ పిల్లలు పుట్టకపోతేనే సరోగసీ విధానం ద్వారా బిడ్డలను కనడానికి అవకాశం ఉంది. అలా కాకుండా సరోగసీ విధానం ద్వారా బిడ్డలను కని ఉంటే వారు చట్టప్రకారం శిక్షార్హలవుతున్నారని చెబుతున్నారు.
పెళ్లయి ఐదేళ్లు గడవకముందే సరోగసీ విధానం ద్వారా పిల్లలను కంటే పదేళ్లు జైలు శిక్ష విధిస్తారని అంటున్నారు. అంతేకాకుండా పది లక్షల రూపాయల జరిమానా కూడా కట్టాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ఒకవేళ నయనతార ఇలాగే బిడ్డలను కని ఉంటే ఆమె తీవ్ర ఇబ్బందుల్లో పడక తప్పదు.
ఇప్పటికే ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది. కవల పిల్లలు ఎలా జన్మించారో వివరాలు ఇవ్వాలని నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులను తమిళనాడు వైద్య, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి ఎం. సుబ్రహ్మణ్యం కోరారు.
సరోగసి(నియంత్రణ) చట్టం-2021 ప్రకారం.. భారత్‌లో పెళ్లి అయిన జంటలతోపాటు విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన ఒంటరి మహిళలు మాత్రమే సరోగసి ద్వారా బిడ్డలు కనడానికి అవకాశం ఉంది.
నయనతార దంపతులకు సరోగసి ద్వారా బిడ్డలు పుట్టారు అని భావిస్తే వారు పెళ్లికి ముందే సరోగసీ విధానానికి వెళ్లినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో నయనతార దంపతులు పెళ్లికి ఆరు నెలల ముందే అద్దె గర్భం విధానాన్ని అనుసరించారని తేలిపోతుంది. అప్పుడు కూడా భారత చట్టాల ప్రకారం నయనతార దంపతులు చేసింది చట్టప్రకారం నేరం అవుతుందని అంటున్నారు.
భారత సరోగసీ (నియంత్రణ) - 2021 చట్టం ప్రకారం బిడ్డను కోరుకునే జంటకు వివాహమై ఉండాలి. వివాహిత వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. సరోగసీ విధానంలో పిల్లలను కనాలనుకునేవారికి ఇప్పటికే పిల్లలు పుట్టి ఉండకూడదు. అలాగే ఎవరినీ దత్తత కూడా తీసుకుని ఉండకూడదు. సరోగసీ విధానం ద్వారా అయినా కూడా ఇప్పటికే పిల్లలను కలిగి ఉండరాదు.
అయితే.. కొన్ని నిబంధనలకు లోబడి ఈ చట్టంలో కొన్ని మినహాయింపుల మేరకు ఇప్పటికే పిల్లలను కలిగి ఉన్నవారు సరోగసీ విధానంలో బిడ్డలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. దంపతులకు ఇప్పటికే ఉన్న పిల్లలు మానసికంగా లేదా శారీరక వైకల్యంతో ఉన్నప్పుడు లేదా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నప్పుడు దంపతులు సరోగసీ ద్వారా మరొక బిడ్డను కనడానికి అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా సరోగసి ద్వారా పిల్లలను పొందాలనుకుంటే సంబంధిత వైద్య అధికారుల నుంచి దంపతులు అనుమతి తీసుకోవాలని సూచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.