Begin typing your search above and press return to search.
నయీం దందా స్టైల్ ఇదిగో ఇలా..!
By: Tupaki Desk | 23 Aug 2016 4:41 AM GMTగ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ ఆగడాలు ఒక్కోటిగా బయటకి వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ నయీం డైరీ సంచలనం రేపింది. ఆ డైరీలో ప్రముఖులతో ఉన్న సంబంధాలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చాలామంది పెద్దల పేర్లు కూడా వినిపించాయి. తాజాగా నయీం ఆడియో క్లిప్ మీడియాక లీకై సంచలనం రేకెత్తిస్తోంది. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన ఒక వ్యాపారిని నయీం ఏవిధంగా బెదిరించాడు అనేది ఈ ఆడియో ట్రాక్ లో ఉంది. తనకు సొమ్ము అర్జెంట్ గా ఇవ్వమనీ - లేదంటే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తా అంటూ ఆ వ్యాపారిని నయీం భయపెట్టిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమాల్లో రౌడీ పాత్రల సంభాషణలకు ఏ మాత్రం తీసిపోని విధంగా నయీం దందా స్టైల్ ఉంటుందని ఈ ఆడియో విన్నవారికి అర్థమౌతుంది!
‘కోటి రూపాయాలు అర్జెంటుగా తీసుకురా. లేదంటే చంపేస్తా’ అంటూ ఫోన్ లో సదరు వ్యాపారిని నయీం బెదిరించాడు. ‘అన్నా, ఆరోగ్యం బాలేదన్నా! గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరానన్నా. పైసలన్నీ ఖర్చు అయిపోయాయన్నా. ఒక్క నెల టైమ్ ఇస్తే, మొత్తం అరేంజ్ చేస్తా’ అంటూ ఆ వ్యాపారి ఎంతగా బతిమాలినా నయీం వినలేదు. ‘నువ్వు మంచిగ ఉంటే, నే మంచిగుంటా! నెల రోజులు టైమ్ ఇచ్చెడిది లేదు. నిన్ను ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు. అయినా, నీ మాటలు వింటుంటే ఏదో అనుమానంగా ఉంది. నెలరోజులు టైం ఎందుకు..? నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నవా? అన్ని రోజులు కుదరదు. ఈయాళ్ల సాయంత్రం సగం సొమ్ము తీసుకురా.. మిగతాది తరువాత.. అర్థమైందా’ అంటూ ఫోనులో వార్నింగు ఇచ్చాడు.
ఈ మాటలు విని ఆ వ్యాపారి ఇంకా భయపడిపోయాతూ.. ‘నీ దండపెడతా, కాల్మొక్కుతా అన్నా. ఈ నెల 31 వరకూ టైమ్ ఇయ్యి. నువ్వు అడిగిన పైసలన్నీ అరేంజ్ చేస్తా. దయచేసి టైమ్ ఇవ్వన్నా’ అంటూ బతిమాలుకున్నాడు. ‘నేలలోపు నేను చచ్చిపోతే పైసలు మిగుల్తయి అని ఆలోచిస్తున్నట్టున్నావ్! ఖబడ్దార్’ అనేసరికి వ్యాపారి వణికిపోయాడు. చాలాసేపు బతిమలాడి ఈ నెలలోపు తాను ఎవ్వరినీ కలవననీ ఇచ్చిన మాట ప్రకారమే కోటి రూపాయిలు రెడీ చేసి ఫోన్ చేస్తానని నానా రకాలుగా నయీంను బతిమాలుకున్నాడు. దీంతో నయీం కాస్త తగ్గి... ‘సరే, నేలాఖరున ఫోన్ చేస్తా. నేను చెయ్యకపోతే మావాళ్లు చేస్తారు. ఫోన్ బంద్ పెట్టావే అనుకో... జాగ్రత్త’ అని వార్నింగ్ ఇచ్చాడు.
నయీం ఎన్‌కౌంటర్‌కు కొద్ది రోజులు ముందుగా నయీం జరిపిన సంభాషణలుగా పోలీసులు చెబుతున్నారు. మార్చి నెలలో ఈ బెదిరింపు కాల్ చేసినట్టు భావిస్తున్నారు. ఈ బెదిరింపులకు సంబంధించి ఒక కేసు కూడా భువనగిరి స్టేషన్లో నమోదు అయిందని అధికారులు చెబుతున్నారు. మీడియాకు లీకైన ఈ ఆడియో టేప్ ఇప్పుడు సంచలనం అవుతోంది. నిజానికి, నయీం బెదిరింపు స్టైల్ ఎలా ఉంటుందో ఆ మధ్య ఒక వాట్సాప్ మెసేజ్ చక్కర్లు కొట్టింది. తనను నయీం కిడ్నాప్ చేసి ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్లి నయీం బెదిరించి పంపేశాడంటూ ఒక మెసేజ్ ఆ మధ్య చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇంకా, ఇలాంటి ఆడియో క్లిప్ ఎన్ని బయటకి వస్తాయో.. నయీం చీకటి సామ్రాజ్యంలోని కొత్త కోణాలు వెలుగు చూస్తాయో?