Begin typing your search above and press return to search.
ఐటీ అధికారులకు చుక్కలు చూపిస్తున్న నయీం ఫ్యామిలీ?
By: Tupaki Desk | 25 Feb 2020 3:00 PM GMTగ్యాంగ్‌స్టర్ నయీం....కొద్ది సంవత్సరాల క్రితం తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన అతి కిరాతకుడైన గ్యాంగ్ స్టర్. గతంలో హైదరాబాద్ - నల్గొండ - భువనగిరి - రంగారెడ్డి - మెదక్ - మహబూబ్ నగర్ జిల్లాల్లో నయీం పేరు చెబితేనే వణికిపోయేవారెందరో ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు - పోలీసులు....ఇలా అందరినీ గుప్పెట్లో పెట్టుకున్న నయీం....తన అవినీతి సామ్రాజ్యాన్ని వేల కోట్లకు విస్తరించాడు. వేయి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లు....వేల కోట్లు కొల్లగొట్టిన నయీం...ఒక ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. అయితే, అందరూ అనుకున్నట్లు నయీం కథ అంతటితో ముగియలేదు. నయీం వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యపు లెక్కలు తేల్చేందుకు సిట్ - ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే, క్రిమినల్ మైండ్ తో ఉన్న నయీం కుటుంబ సభ్యులు ఆ అవినీతి లెక్కలు చూపకుండా ఐటీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారట.
బెదిరింపుల - దందాలు - హత్యలు - సెటిల్ మెంట్ లతో నయీం దాదాపు 10 వేల కోట్లు కూడబెట్టాడని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు...నయీం కుటుంబసభ్యుల నుంచి ఆ ఆస్తుల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, నయీం కుటుంబీకులు ఐటీ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారట. నోటీసులిచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఐటీ అధికారులకు చిక్కక్కుండా తప్పించుకు తిరుగుతున్నారట. అందుకున్న అరకొర నోటీసులను లెక్కచేయకుండా ఐటీ అధికారులకు చికాకు తెప్పిస్తున్నారట. నయీం భార్య - తల్లి - సోదరిలకు ఇప్పటికే 9 సార్లు నోటీసులు ఇచ్చారట. దాదాపు 1000 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి ఐటీ శాఖ వివరణ కోరిందని తెలుస్తోంది. ఇక నయీం కుటుంబ సభ్యులతో లాభం లేదనుకున్న ఐటీ అధికారులు....తాజాగా నయీం అనుచరుడు పాశం శ్రీనుకు నోటీసులు ఇచ్చారట. బ్రతికున్నపుడు పోలీసులను సాధించిన నయీం....చచ్చాక ఐటీ అధికారులను సాధిస్తున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.