Begin typing your search above and press return to search.
సంచలనం: సీబీఐ చేతికి నయీం కేసు!
By: Tupaki Desk | 9 March 2021 12:30 PM GMTతెలంగాణ రాజకీయాలను షేక్ చేసే నిర్ణయాలను కేంద్రంలోని బీజేపీ తీసుకుందన్న టాక్ నడుస్తోంది. తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు, పోలీసులు, అధికారులు ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ తాజాగా తెలంగాణ సర్కార్ కు లేఖ రాసినట్టు సమాచారం.
ఇందులో కీలక నేతలు, పోలీసులు, అధికారుల ప్రమేయం బయటపడినట్టు ఆరోపణలు రావడం.... కోట్ల విలువైన భూముల కబ్జాలు, హత్యలు, దోపిడీలు, అత్యాచారాల చుట్టూ ముడిపడి ఉండడంతో టీఆర్ఎస్ సర్కార్ ఈ తేనెతుట్టను కదపలేకపోయింది. కేవలం నయీంను హతమార్చి మిగతా కేసులో పెద్దగా ముందుకు సాగడం లేదు. రాజకీయ, అధికార ఒత్తిళ్లు దీనివెనుక పనిచేశాయన్న అపవాదు రాజకీయవర్గాల్లో ఉంది.
అందుకే నయీం కేసు అనగానే.. అటు ప్రభుత్వం, పోలీసులు, ప్రజాప్రతినిధులు కూడా సైలెంట్ అయ్యారు. కానీ ఫోరం ఫర్ బెటర్ గవర్నెన్స్ సంస్థ తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా నయీం కేసును సీబీఐకి ఇవ్వాలని కేంద్రం తెలంగాణ సర్కార్ ను అడిగినట్లు సమాచారం.
నయీంను ఎన్ కౌంటర్ చేశాక వేల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. బస్తాల కొద్దీ నగదు, వందల్లో ఆస్తి డాక్యుమెంట్లు వందలమంది నేతలు, పోలీసులు, అధికారుల ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ టీ సర్కార్ ఈ కేసులో సైలెంట్ అయ్యింది.
నయీంతో సంబంధాలున్నాయని తెలిసి కొంతమంది పోలీసులను సస్పెండ్ చేశారు. మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. నేతలు ఎవరికి సంబంధం లేదని ప్రభుత్వం తేల్చేసింది. సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఇవన్నీ బయటపడడం ఖాయం..
ఈ నయీం కేసు విషయంలో తెలంగాణ బీజేపీ చక్రం తిప్పిందని.. కేంద్రం ద్వారా కేసీఆర్ సర్కార్ ను ఇబ్బందిపెట్టేలా సీబీఐ అస్త్రం ప్రయోగించిందని అంటున్నారు. తర్వాత దీనిపై హైకోర్టులో పిటీషన్ వేయించి సీబీఐకి అప్పగించేలా చక్రంతిప్పుతారని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు నయీం కేసు మళ్లీ తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.