Begin typing your search above and press return to search.

నయిం రాక్షసత్వం రేంజ్ బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   7 Sept 2016 10:26 PM IST
నయిం రాక్షసత్వం రేంజ్ బయటకొచ్చింది
X
గ్యాంగ్ స్టర్ నయిం ఎన్ కౌంటర్ అనంతరం అతగాడి అకృత్యాల గురించినవివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎన్ కౌంటర్ జరిగి ఇన్నిరోజులు అవుతున్నా.. నేటికీ మీడియాలో నయిం వార్తలు లేకుండా వార్తాపత్రికలు బయటకు రాని పరిస్థితి. తవ్వేకొద్దీ నయిం దుర్మార్గాలు.. అకృత్యాలు..ఆరాచకాలు బయటకు వస్తూ విస్తుగొల్పుతున్నాయి. తాజాగా అలాంటిఉదంతమే ఒకటి బయటకు వచ్చింది.

నయిం ఎన్ కౌంటర్ తర్వాత అతడి నివాసం నుంచి బాలికల్ని పోలీసులుగుర్తించారు. వారు ఎవరు? నయిం ఇంట్లో ఎందుకు ఉన్నారు? వారికి అక్కడేంపని లాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటిపై ఆరా తీసిన పోలీసులకు షాకింగ్నిజాలు బయటకు వచ్చాయి. తెలిసిన వారు.. పరిచయిస్తులకు చెందిన వారినపిల్లల్ని ఇంటికి తీసుకురావటం వారిని చిత్రహింసలకు గురి చేయటం.. వారిపైఅత్యాచారాలు చేయటం లాంటివి చేసేవాడని తెలిసింది.

నయిం ఇంట్లో ఉన్న బాలికల వాంగ్మూలాన్ని సేకరించిన పోలీసులకు వారిచ్చినసమాచారం గురించిన వివరాలు బయటకు వచ్చాయి. దీని ప్రకారం నయింఅత్త సుల్తానా.. భార్య.. సోదరి లాంటి వాళ్లు బాలికల్ని నయిం దగ్గరకుపంపేవారని తేలింది. ఒప్పుకోని వారిని తీవ్రంగా గాయపర్చటం.. పచ్చిమిర్చిరసం తాగించి అత్యాచారం చేసేవాడని పేర్కొన్నారు. అత్యాచారం తర్వాత ఏవోమందులు ఇచ్చేవాడని వారు వెల్లడించారు. తమ తల్లిదండ్రుల దగ్గర తన పెళ్లిచేస్తామని తీసుకొచ్చి.. నయింకు అప్పగించినట్లుగా ఒక బాలిక వెల్లడించింది.నయిం అకృత్యాలకు అంగీకరించని వారిపై శారీరక దాడులకు పాల్పడటమేకాదు.. ఎదురుమాట్లాడిన ఒక బాలికను హతమార్చిన వైనం పోలీసుల దృష్టికిఇప్పటికే రావటం తెలిసిందే.