Begin typing your search above and press return to search.
నయిం కేసీఆర్ నే బెదిరించాడట
By: Tupaki Desk | 20 Dec 2016 4:56 AM GMTనరరూప రాక్షసుడిగా వ్యవహరిస్తూ.. వ్యవస్థల్ని తన చెప్పు చేతల్లోకి తీసుకున్న కరుడుగట్టిన నేరస్తుడు నయిం ఎన్ కౌంటర్ కావటం తెలిసిందే. నయింకు సంబంధించిన చర్చ తాజాగా తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడిగా సాగింది. ఈ సందర్భంగా నయిం ఆరాచకాలపై తెలంగాణ అధికారపక్ష నేతలు చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. సంచలనంగా ఉన్నాయి.
ఉద్యమనేతగా రాజకీయ పార్టీలకు సైతం వణుకు పుట్టించిన కేసీఆర్ లాంటి అధినేతను కూడా నయిం వార్నింగ్ ఇచ్చారా? అంటే అవుననే మాటను చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని కేసీఆర్ తానే స్వయంగా చెప్పటం విశేషం. నయింను కట్టడి చేయటానికి తెలంగాణ ప్రభుత్వానికి రెండేళ్లు పట్టిందంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ చేసిన వ్యాఖ్యపై స్పందించిన కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నయిం విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు.
పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నయింను ఏమీ చేయకుంటే.. తాము మాత్రం అతడ్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించామన్నారు. తమను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు.. తాము అధికారంలో ఉన్న పదేళ్లు నిద్రపోయిందా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘లొంగిపోయిన మావోయిస్ట్ సాంబశివుడు ప్రజాజీవినంలోకి వస్తానంటే మా పార్టీలోకి చేర్చుకున్నాం. అతన్ని కూడా నయిం హత్య చేశాడు. సాంబశివుడు సంస్మరణ సభలో పాల్గొన్న నేను గట్టి హెచ్చరికలు చేశాను. అప్పట్లో నన్ను భువనగిరి కూడా దాటి వెళ్లలేవని బెదిరించాడు’’ అంటూ గతంలో జరిగిన విషయాన్ని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. అందుకే నేరాలుతగ్గినట్లుగా కేసీఆర్ చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాము కూడా నయిం బాధితుడ్నే అన్న విషయాన్ని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. నయింను కట్టడి చేయటంతో పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమీ చేయలేదన్నమాటను చెబుతూ.. నయిం తన డ్రైవర్ ను కిడ్నాప్ చేశాడని.. తననూ బెదిరించిన విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో తాను హరీశ్ రావును కలుసుకొని.. జరిగింది చెప్పి.. నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి విన్నవిస్తే ఎలాంటి చర్యా తీసుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సాక్ష్యాత్తు ఫ్లోర్ లీడర్ కు రక్షణ కల్పించలేదని.. అలాంటి పార్టీ నేతలు తమను ఎలా విమర్శిస్తారని మండిపడ్డారు. నయిం ఆరాచకాలు ఏ స్థాయిలో సాగాయన్న దానికి సీఎం కేసీఆర్.. ఆర్థికమంత్రి ఈటెల మాటల నిలువెత్తు నిదర్శనాలుగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/