Begin typing your search above and press return to search.
చరిత్రలో ఒక మిస్టరీ వీడనుంది!!
By: Tupaki Desk | 21 Aug 2015 4:24 AM GMTవందల కోట్ల రూపాయిల విలువైన ఆస్తికి సంబంధించి తాజాగా జర్మనీ ప్రభుత్వానికి వేటగాళ్ల బృందం ఒకటి ఆఫర్ ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. నాటి జర్మనీ నియంత హిట్లర్ దాచిన సంపదను పోలాండ్ నుంచి జర్మనీ తెప్పించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా 23 రైలు కంటైనర్లలో బంగారం.. డబ్బు.. రత్నాలు తదితరాలను పోలాండ్ నుంచి జర్మనీకి తీసుకురావాలని భావించారు.
ఇందుకు తగ్గ ఏర్పాట్లు అన్నీ చేశారు. అయితే.. పోలాండ్ నుంచి బయలుదేరిన రైలు.. కనిపించకుండా పోయింది. దశాబ్దాల తరబడి ఆ రైలుబండి కోసం వేట సాగించారు. అయినా.. ఎలాంటి ఫలితం దక్కలేదు. విలువైన సంపదన ఉన్న రైలుబండి మాయమైందన్న విషయాన్ని తెలుసుకున్న అప్పటి జర్మనీ నియంత హిట్లర్.. వెంటనే రైలు ప్రయాణించే అన్ని సొరగాల్ని మూసేసి మరీ వెతికించారు.
అయినా.. ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. రైలు బండి మాయం కావటం చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా గుప్త నిధుల వేట సాగించే ఓ ఇద్దరు వేటగాళ్లు జర్మనీ సర్కారుకు ఒక ఆఫర్ చేశారు. అప్పుడెప్పుడో మాయమైన రైలు బండిని తాము గుర్తించామని.. దాని వివరాలన్నీ ఇస్తామని.. కాకపోతే.. తమ వాటా ఏమిటో తేల్చాల్సిందిగా కోరుతోంది.
తమకు మొత్తం సొత్తులో ఎంత వాటా ఇస్తారో చెబితే.. రైలు ఎక్కడున్నది చెప్పేస్తామని అంటున్నారు. మరి.. వారి మాటల్ని జర్మనీ ప్రభుత్వం విశ్వసిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ సదరు వేటగాళ్ల మాట నిజమే అయితే.. బిలయన్ల కొద్దీ అమెరికా డాలర్ల ఆస్తి జర్మనీ సొంతం కావటం ఖాయం. మరి.. సదరు వేటగాళ్ల మాటను జర్మనీ సర్కారు నమ్ముతుందా? లేదా? అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది.