Begin typing your search above and press return to search.

లోకేష్ కాలేజీ సరదాలు... లైట్ తీస్కున్న బాబు బాలయ్య

By:  Tupaki Desk   |   14 Oct 2022 4:00 PM GMT
లోకేష్ కాలేజీ సరదాలు... లైట్ తీస్కున్న బాబు బాలయ్య
X
ఒక వయసులో ఎవరు ఏమి చేసినా అందులో ముచ్చటనే చూస్తారు. తప్పు వెతకాలనుకోరు. ఆ సందర్భంలో చేసే చిలిపి అల్లరి పనులను బట్టి టోటల్ క్యారక్టర్ ని లైఫ్ లాంగ్ కి లెక్క వేసి చెప్పరు. అది కుదరదు కూడా. కానీ చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ విషయంలో మాత్రం కొన్ని ఫోటోలు ఎపుడూ ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. అవి సోషల్ మీడియాలో తెగ తిరిగాయి.

ఆఖరుకు చట్ట సభలలో రచ్చకు కారణమయ్యాయి. ఆ ఫోటోల మ్యాటర్ ఏమిటీ అంటే ఫారిన్ లో ఒక స్విమ్మింగ్ ఫూల్ లో లోకేష్ హాఫ్ బేర్ బాడీతో అందమైన ఫారిన్ ముద్దు గుమ్మలతో ఉన్న ఫోటో. అలాగే బీచ్ లో తిరిగిన ఫొటోలు వాటిని ఈ రోజుకీ ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తూ లోకేష్ ది ఇదీ క్యారక్టర్ అని ఏకేస్తూ ఉంటారు.

దానికి ఇప్పటిదాకా లోకేష్ ఎక్కడా సమాధానం చెప్పలేదు కానీ ఫస్ట్ టైం తన మామయ్య బాలయ్య హోస్ట్ గా నిర్వహించే అన్ స్టాపబుల్ రియాల్టీ షోలో పెదవి విప్పారు. 2006లో తాను కాలేజీ డేస్ లో సరదాగా గడిపిన సందర్భంలో క్లిక్ మనిపించిన ఫోటోలు అవి. అక్కడ ఉన్న అమ్మాయిలు నాకే కాదు బ్రాహ్మణికి కూడా కామన్ ఫ్ర్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చేశారు. అవి నా అందమైన రోజులు. అవసరం అనుకుంటే వాటిని ఫ్రేం కట్టించి కూడా సేఫ్ గా చూసుకుంటా అని చెప్పారు.

దీని మీద మామ బాలయ్య కూడా లైట్ తీసుకున్నారు. మొత్తానికి నీ ఫోటోలు కాదు కానీ శాసనమండలి దాకా వెళ్లాయని సెటైర్ వేశారు. ఈ ఫోటోల మీద మీ కామెంట్స్ ఏంటి అన్నపుడు చంద్రబాబు కూడా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. పిల్లను ఇచ్చిన మామే నో డౌట్ నా అల్లుడు బంగారం అంటూంటే మధ్యలో నాకేంటి అని బాబు ఫుల్ లైట్ తీసుకున్నారు.

అదన్న మాట మ్యాటర్. లోకేష్ చేసినవి సరదా కార్యక్రమాలు తప్ప అందులో రాసలీలలు లేవు, మరే లీలలూ లేవు. ఇది అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ద్వారా అందరికీ తెలిసిపోయింది. ఇక దీని మీద మళ్లీ ప్రత్యర్ధులు నోరెత్తినా వైరల్ చేసినా వాటికి వాల్యూ ఉంటుందంటారా. ఏమో చూడాలి.

ఇక మంగళగిరిలో ఓడిన లోకేష్ తన ఓటమికి లైట్ తీసుకోవడం విశేషం. ఎస్ నేను ఓడాను, కానీ ఈసారి ఓడిన చోట నుంచే గెలుస్తా. మూడేళ్ళుగా అక్కడే ఉంటున్నా అని ధీమాతో చెప్పారు. అంటే 2024లో లోకేష్ మంగళగిరి నుంచే బరిలో ఉంటారన్న మాట. ఈసారి పక్కాగా ఎమ్మెల్యేగా గెలిచేది ఆయనే అన్న మాట. ఎనీ డౌట్స్ అంటున్నారు మామ, తండ్రీ కూడా.