Begin typing your search above and press return to search.

దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ దందా..ఐపీఎస్ ఇంట్లో..

By:  Tupaki Desk   |   14 May 2019 4:36 AM GMT
దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ దందా..ఐపీఎస్ ఇంట్లో..
X
కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల డ్రగ్స్.. పట్టుబడ్డది ఎక్కడో కాదు.. ఒక ఐపీఎస్ ఇంట్లో.. కానీ ఈ కేసులో ఆ పోలీస్ ఆఫీసర్ కు ఎలాంటి పాత్ర లేదు.. ఎలా సాధ్యమైంటే.. అక్కడే ఉంది తిరకాసు..

ఐఏఎస్ అన్నాక ట్రాన్స్ ఫర్లు సహజం.. అందుకే యూపీలోని నోయిడాలో సొంత ఇళ్లు కట్టుకున్న ఐపీఎస్ తన ఇంటిని ఖాళీగా ఉంచడమెందుకని బ్రోకర్ల ద్వారా అద్దెకు ఇచ్చాడు. అసలే అదే ఐపీఎస్ ఇళ్లు.. ఎవరూ అటు తిరిగి చూడరు. దీన్నే అడ్వంటేజ్ గా తీసుకున్నారు కేటుగాళ్లు.. ఇంకేముంది డ్రగ్స్ కు అడ్డాగా ఆ ఇంటిని మార్చారు.

తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సమాచారం అంది దాడి చేయగా కళ్లు చెదిరే రీతీలో డ్రగ్స్ బయటపడ్డాయి. దేశంలో ఇప్పటివరకు పట్టుబడనంత స్థాయిలో దాదాపు 1818 కిలోల డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. దీని ఖరీదు దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉండడం విశేషం. ఇంత భారీ స్థాయిలో పట్టుకున్న అధికారులే షాక్ కు గురి అయ్యేంతలా అక్కడ ఉంది.

ఐపీఎస్ ఆఫీసర్ ఇంటినే డ్రగ్స్ కు అనువైన కేంద్రంగా భావించి దందా నడిపిన నైజీరియా దేశస్తులతో పాటు దక్షిణాఫ్రియా జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంత పెద్ద డ్రగ్స్ దందా తనకే తెలియకుండా తన ఇంట్లో జరుగుతున్న విషయం తెలిసి సదురు పోలీస్ ఆఫీసర్ షాక్ గురి అవ్వడం విశేషం. అయితే డ్రగ్స్ దందాపై సదురు ఇంటి యజమాని అయిన ఐపీఎస్ ఆఫీసర్ ను విచారించగా బ్రోకర్ ద్వారా తాను కిరాయికి ఇచ్చానని.. అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదన్నాడు. అయితే వాళ్లు ఏడాదిగా తనకు అద్దె ఇవ్వలేదని చెప్పడం కొసమెరుపు.

*దొరికిపోయారు ఇలా..

ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన ఓ విదేశీ మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమె బ్యాగ్ తనిఖీ చేయగా 24.7 కిలోల డ్రగ్స్ కనిపించడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో ఐపీఎస్ ఇంటిని కేంద్రంగా చేసుకొని నడిపిస్తున్న డ్రగ్స్ దందా బయటపడింది. వివిధ మార్గాల ద్వారా అక్రమంగా సేకరించిన రసాయనాలతో వీరు డ్రగ్స్ తయారు చేస్తూ విదేశాలకు.. ఢిల్లీలో సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.