Begin typing your search above and press return to search.
'రాఫెల్' డీల్ తో ఎన్సీపీలో ముసలం!
By: Tupaki Desk | 29 Sep 2018 8:49 AM GMT`రాఫెల్` డీల్ వ్యవహారం దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందంలో బీజేపీ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో మోదీకి అనుకూలంగా మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ పై పలువురు జాతీయస్థాయి నాయకులు మండిపడ్డారు. శరద్ పవార్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయనకు అత్యంత సన్నిహితుడు - ఎన్సీపీ వ్యవస్థాప సభ్యుడు - ఎంపీ తారీఖ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా, పవార్ కు మరో ఎన్సీపీ కీలకమైన నేత షాకిచ్చారు. మోదీకి పవార్ మద్దతివ్వడం పై నిరసన వ్యక్తం చేస్తూ ఎన్సీపీ జనరల్ సెక్రటరీ మునాఫ్ హకీమ్ తన పదవికి - పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. రాఫెల్ కుంభకోణంపై మోదీ - బీజేపీపై వ్యతిరేకత వస్తున్నా....మోదీకి మద్దతుగా పవార్ మాట్లాడడం తనకు నచ్చలేదని - అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నానని హకీమ్ తెలిపారు.
`రాఫెల్` డీల్ కుంభకోణం ఎన్సీపీలో ముసలం రేపుతోంది. `రాఫెల్`డీల్ వ్యవహారంలో మోదీపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవని పవార్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. `రాఫెల్` యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతిక వివరాలను వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం అంతగా ప్రభావం చూపడం లేదని పవన్ ...బీజేపీకి మద్దతుగా వ్యాఖ్యానించారు. వాటి ధరలు బహిర్గతం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగబోదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు పవార్ చేసిన కామెంట్స్ పై ఎన్సీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవార్ సన్నిహితుడు తారీఖ్ - హకీమ్ లు రాజీనామా చేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు తారీఖ్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా - అభిప్రాయం తీసుకోకుండా `రాఫెల్` ఒప్పందంపై మోదీకి అనుకూలంగా పవార్ మాట్లాడడం తనకు ఏమాత్రం నచ్చలేదని హకీమ్ అన్నారు. ఎన్సీపీ ప్రతిష్టను దిగజార్చేదిగా పవార్ వ్యాఖ్యలున్నాయని ఆయన అన్నారు.