Begin typing your search above and press return to search.
బీజేపీ ప్రాంతీయ పార్టీలను అంతం చేస్తోందా..?
By: Tupaki Desk | 11 Aug 2022 6:47 AM GMTదేశవ్యాప్తంగా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కమలం నాయకులు తమ అస్త్రాలన్నీ ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే 21 రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెపరెపలాడుతోంది. మరిన్ని రాష్ట్రాలను కైవసం చేసుకునేందుకు రకరకాల వ్యూహం వేస్తున్నారు. ఉత్తరాదిన దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలన కొనసాగుతుండగా ఇప్పుడు దక్షిణాదివైపు దృష్టి ఆకర్షించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మహారాష్ట్రను చేజిక్కించుకుంది.
ఇప్పుడు తెలంగాణ వైపు ఫోకస్ పెట్టింది. అయితే మొన్నటి వరకు అధికారంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిని మహారాష్ట్రలో ఇప్పుుడు పరోక్షంగా బీజేపీ పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలను బీజేపీ అంతం చేయాలనుకుంటోందని అన్నారు. దీనిని బట్టి చూస్తే రాను రాను నిజంగానే ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోనున్నాయా..? అని చర్చించుకుంటున్నారు.
2019 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చాక.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. అయితే మొదట్లో బీజేపీపై వ్యతిరేకత కారణంగా రాజస్థాన్, చత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఆ తరువాత మళ్లీ బీజేపీ పుంజుకుంది. ఐదు రాష్ట్రా వెస్ట్ బెంగాల్ నుంచి గోవా వరకు ఐదురాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పంజాబ్, బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. అయితే బెంగాల్ లో టీఎంసీని ఓడించేందుకు గట్టిగా ప్రయత్నించినా ఎదురొడ్డి నిలవడంతో దీదీ అధికారంలోకి వచ్చారు. ఇక ఢిల్లీలో జోరు కొనసాగిస్తున్న ఆప్ పంజాబ్ లో అధికారంలోకి వచ్చారు.
అయితే మొన్నటి వరకు మహారాష్ట్రలో శివసేన అధికారంలో ఉండగా బీజేపీ తన వ్యూహంతో ఆ పార్టీని కకావికలం చేసింది. శివసేనలోని కొందరు బీజేపీలోకి సపోర్టు ఇవ్వడంతో ఇఫ్పుడు బీజేపీ చేతిలో కొసాగుతోంది. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీ రకరకాల వ్యూహం పన్నుతోంది. ఇదిలా ఉండగా మొన్నటి వరకు సై అంటే సై అన్న టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఆ తరువాత మోదీతో కాంప్రమైజ్ కావండంతో ఇక ఆ పార్టీ కూడా బీజేపీ యూనియన్లో కలిసినట్లయింది.
ఈ నేపథ్యంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాను రాను బీజేపీ ప్రాంతీయ పార్టీలను అంతం చేయాలనుకుంటోందని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండి తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుంటుండగా ఒక్కొక్క పార్టీని తనలో కలిపేసుకుంటుందని అంటున్నారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో శరద్ పవార్ వ్యాఖ్యలు నిజరూపం దాల్చుతాయా..? అని కొందరు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ లాంటి నాయకులు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ముందుకు సాగుతున్నా.. దేశంలోని మిగతా ప్రాంతీయ పార్టీలో సపోర్టు రావడం లేదు. దీంతో టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందోనని అనుకుంటున్నారు.