Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే ఇంట్లో వైరస్ కలకలం ..ఎమ్మెల్యేతో సహా మరో ముగ్గురికి ..!

By:  Tupaki Desk   |   29 May 2020 8:15 AM GMT
ఎమ్మెల్యే ఇంట్లో వైరస్ కలకలం ..ఎమ్మెల్యేతో సహా మరో ముగ్గురికి ..!
X
దేశంలో వైరస్ మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ముఖ్యంగా మన దేశం లోని మహారాష్ట్రలో ఈ వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 59,546కు చేరింది. ఇక తాజాగా మహారాష్ట్ర కి చెందిన ఓ ఎమ్మెల్యే కి , అలాగే మరో ముగ్గురు కుటుంబ సభ్యులకి వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది.

మహారాష్ట్రలోని డియోలాలి ఎన్పీపీ ఎమ్మెల్యే సరోజ్ అహోరి ఇంట్లో కరోనా కలకలం రేపింది. సరోజ్ ఇంట్లో మొత్తం నలుగురు కరోనా బారిన పడ్డారు. ఈ విషయంపై సరోజ్‌ మాట్లాడుతూ.. మా ఇంట్లోని ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటు నాకు కూడా వైరస్ సోకింది అని అన్నారు. ఇటీవల సరోజ్ కుటుంబం అంత్యక్రియల్లో పాల్గొనగా.. అక్కడే వైరస్ సోకినట్లు సమాచారం. కాగా మహారాష్ట్రలో ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ వైరస్‌ సోకింది. ఎన్సీపీ ఎమ్మెల్యే, హౌసింగ్ మినిస్టర్‌ జితేంద్ర అవ్హద్‌కి కరోనా రాగా.. ఆయన ఇటీవలే కోలుకున్నారు. ఇక మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీడబ్ల్యూడీ మంత్రి అశోక్‌ చవాన్‌ వైరస్ బారిన పడగా.. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు

కాగా, మహారాష్ట్రలో ఇప్పటివరకు 4.19లక్షల పరీక్షలు జరిగాయి. అందులో 59,546 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ కాగా.. ప్రస్తుతం 35,122 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క ముంబయి నగరంలోనే 35,485 కేసులున్నాయి. మహారాష్ట్రలో 6.12లక్షల మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.