Begin typing your search above and press return to search.
గుజరాత్ ఎఫెక్ట్!..కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ!
By: Tupaki Desk | 14 Aug 2017 12:34 PM GMTకాంగ్రెస్ పేరుకే గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు దేశంలో ఏ ఒక్క ప్రాంతంలోనూ ప్రభావం చూపే స్థితిలో లేదనే చెప్పాలి. మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దాకా పరిస్థితి ఇలానే ఉంటే... అమేధీ - రాయబరేలీల్లోనూ ఆ పార్టీ ఓటమి చవిచూడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ రెండు స్థానాలు ఎవరివనుకుంటున్నారు... తొలి స్థానం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీది కాగా, రెండో స్థానం ఏకంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్న సోనియా గాంధీది. ఈ రెండు స్థానాల్లో ఏ ఒక్క స్థానంలో ఆ పార్టీ ఓడినా... ఇక ఆ పార్టీ తట్టా బుట్టా సర్దేసుకున్నట్లుగానే భావించాల్సి వస్తుంది.
అయినా ఇప్పుడు ఆ దిశగా భావించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న అంశానికి వస్తే... మొన్నటికి మొన్న ఆ పార్టీ సహకారంతో బీహార్ లో వరుసగా మూడో పర్యాయం సీఎంగా కుర్చీనెక్కిన జేడీయూ నేత ఇప్పుడు ఎన్డీఏ పంచన చేరిపోయారు. జేడీయూ కంటే కూడా మరింత ప్రాధాన్యం కలిగిన పార్టీగా ప్రచారంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కూడా ఇప్పుడు జేడీయూ బాటలోనే నడుస్తోందన్న భావన కలుగుతోంది. ఇదేదో... ఊరికే ఊహాగానాలతో చెబుతున్న మాట కాదు. సాక్షాత్తు ఎన్సీపీకి చెందిన కీలక నేత - కేంద్ర మాజీ మంత్రి ప్రపుల్ పటేల్ బహిరంగంగా చేసిన ప్రకటనతోనే ఈ అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక అసలు విషయంలోకి వెళితే... కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వాన నేటి ఉదయం ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి ఎన్సీనీ హాజరుకాలేదు. జేడీయూ విపక్షాల కూటమి నుంచి తప్పుకున్న నేపథ్యంలో జరిగినందున ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇంతటి కీలక తరుణంలో ఎన్సీపీ ఈ సమావేశాన్ని ఎందుకు బాయ్ కాట్ చేసిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ లా మారింది. కేంద్రంలో బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలనే అంశంపై సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకే సమావేశాన్ని ఏర్పాటు చేశారన్న వాదన ఉంది. అలాంటి సమావేశానికి ఎన్సీపీ రాకపోవడం ఈ అనుమానాలకు తెరలేపింది.
ఇంతకుముందు జరిగిన అన్ని విపక్షాల సమావేశానికి శరద్ పవార్ హాజరయ్యారు. ఈసారి మాత్రం తాను అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నానని కబురు పంపినట్లుగా వార్తలు వినిపించినా... తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రఫుల్ పటేల్ బహిరంగంగా ప్రకటించడంతో ఎన్సీపీ ఉద్దేశపూర్వకంగానే ఈ సమావేశాన్ని బాయ్ కాట్ చేసిందని తేలిపోయింది. అయినా ఉన్నట్టుండి ఈ సమావేశానికి ఎన్సీపీ ఎందుకు గైర్హాజరైందన్న విషయానికి వస్తే... ఇటీవల గుజరాత్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్ కు తాము ఓటు వేసినప్పటికీ వేయలేదని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోందని ఎన్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఈ కారణంగానే తాము ఈ సమావేశానికి హాజరు కాలేదన్న కోణంలోనే పటేల్ సంచలన ప్రకటన చేశారు. మరి పవార్ బృందాన్ని చల్లబరిచేందుకు సోనియమ్మ ఏ అస్త్రం బయటకు తీస్తారో చూడాలి.