Begin typing your search above and press return to search.
క్యాన్వాయ్ లో కారు బోల్తా ... ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు ప్రమాదం !
By: Tupaki Desk | 29 Jun 2020 1:00 PM GMTఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు తృటిలో ఘోర ప్రమాదం నుండి తప్పించుకున్నారు. శరద్ పవార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఓ వాహనం బోల్తా పడింది. ముంబై - పుణె ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శరద్ పవార్.. పుణే నుంచి ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని పోలీస్ పైలట్ వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది.
ఆ జీపులోని డ్రైవర్ కు, కొంత మంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే.. అప్పటికే శరద్ పవార్ వాహనం దాటి వెళ్లడం వల్ల ఆయనకు ప్రమాదం తప్పింది. జీపు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. గాయపడిన డ్రైవర్, పోలీసులకు సంఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పుణే జిల్లా రూరల్ పోలీసులు తెలిపారు.
దేశ రాజకీయాల్లోనే కురువృద్ధుడిగా పేరున్న శరద్ పవార్.. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తన సత్తా ఏమిటో మరోసారి చూపించారు. కుటుంబంలోని వ్యక్తులే విపక్షాల గూటికి చేరిన సమయంలో ఆత్మవివ్వాసం కోల్పోకుండా పోరాడి చివరికి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు. ఫలితాల అనంతరం ఆయనతో పొత్తు కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ చేయని ప్రయత్నాలు లేవు. బీజేపీకి లొంగినట్టే సంకేతాలిచ్చి చివరికి ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్, శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.