Begin typing your search above and press return to search.
మోడీ ఎంత తెలివైనోడంటే...
By: Tupaki Desk | 26 Jun 2016 5:56 AM GMTప్రచారం చేసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మించిన వారు లేరనేది అందరికీ తెలిసిన సంగతే. తాజాగా నిర్వహించి వికాస్ పర్వ్ ఇందుకు ఉదాహరణ. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా వికాస్ పర్వ్ పేరుతో అట్టహాసంగా వేడుకలు - ప్రకటనలు - ప్రచార ఆర్భాటాలు అందరికీ గుర్తే. అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. అది కూడా అధికారికంగా ఇచ్చిన సమాచారం కావడం ఆసక్తికరం.
వికాస్ పర్వ్ పేరుతో ప్రచార - ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలతో హోరెత్తించిన ప్రభుత్వం రికార్డుల్లో మాత్రం రెండేళ్ల వేడుకలకు ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదని చెబుతోంది. ఎన్ సీపీ విద్యార్థి విభాగం నేత ప్రణయ్ అజ్మీరా ఆర్ టీఐ కింద సమాచారం కోరగా ఎన్డీఏ పాలన సంబరాల కోసం పత్రికలు - టీవీల్లో ప్రకటనలపై ఎలాంటి మొత్తం చెల్లించలేదని డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ - విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) వెల్లడించడం విశేషం. మరి ప్రభుత్వం పైసా కూడా చెల్లించపోతే..ఈ మొత్తం మూడో వ్యక్తిని చెల్లించాలని ప్రభుత్వం కోరిందా..? లేక ప్రైవేట్ ఏజెన్సీకి కాంట్రాక్టును కట్టబెట్టిందా..? అని ఎన్ సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ప్రశ్నించారు. దేశంలో పలు ప్రాంతాల్లో కరువు నెలకొన్న క్రమంలో రెండేండ్ల వేడుకలకు భారీగా ఖర్చు పెట్టిన మొత్తాన్ని వెల్లడించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదన్నారు. ఆర్ టిఐ సమాచారం సంతృప్తికరంగా లేకపోవడంతో మరోసారి ఆయన సమాచారం కోరనున్నారు.