Begin typing your search above and press return to search.

పుల్వామా ఎటాక్‌ ఎన్టీయే గ్రాఫ్‌ పెంచింది

By:  Tupaki Desk   |   19 March 2019 5:29 AM GMT
పుల్వామా ఎటాక్‌ ఎన్టీయే గ్రాఫ్‌ పెంచింది
X
ఎన్నికల సమయంలో సర్వేలు రావడం సర్వసాధారణం. ప్రతీ పార్టీ తమకు అనుకూలంగా ఉండేలా సర్వేలు చేయించుకుంటాయి. కొన్నిమాత్రం జెన్యూన్‌ గా ఇస్తే.. ఇంకొన్ని మాత్రం పార్టీలకు ఫేవర్‌ గా ఇస్తుంటాయి. తాజాగా టైమ్స్‌ నౌ ఛానెల్‌ తన సర్వే ఫలితాలను బయటపెట్టింది. ఈ సర్వేలో ఎన్టీయేకు ఈసారి అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పింది. అన్నింటికి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి గత రెండు నెలల క్రితం ఇదే ఛానెల్‌ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని సర్వే చేసింది. ఈ సర్వేలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కష్టకాలమే అని తేల్చిచెప్పింది. అయితే.. ఈలోపుగా పుల్వామా దాడి - పాకిస్థాన్‌ తో జరిగిన పరిస్థితులు ఎన్డీయోకు అనుకూలంగా మారాయి. తాజా సర్వేలో మాత్రం జనవరి తర్వాత జరిగిన రెండు ప్రధాన ఘటనలతో దేశ ప్రజలు తిరిగి ఎన్డీయేకే పట్టం కట్టనున్నట్లు జోస్యం చెప్పింది.

ఎన్నికల వేళ మోదీ కూడా స్పీడ్‌ పెంచాడు. ప్రతీరోజూ ఒక సభలో మాట్లాడుతూ ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలు అయిన నోట్ల రద్దు - జఎస్టీని ప్రజలు ఇప్పుడు మర్చిపోయారు. అయితే ఆ తర్వాత మోదీ చేసిన కొన్ని పనులు ప్రజల్ని బాగా ఆకట్టుకున్నాయని టైమ్స్ నౌ సర్వే తేల్చిచెప్పింది. ముఖ్యంగా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రజలను ఆకట్టుకుందని సర్వే పేర్కొంది. ఆ తర్వాత ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడులకు ప్రతీకార చర్యల్లో భాగంగా పాకిస్తాన్‌ లోని బాలాకోట్ పై వైమానిక దాడులను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించడంతో ప్రజలు తిరిగి మోడీకే పట్టం కట్టేందుకు సిద్దపడ్డారని వెల్లడించింది.