Begin typing your search above and press return to search.
మనం వదిలిన తెలుగు.. అక్కడ చదువుతున్నారు
By: Tupaki Desk | 12 March 2020 9:50 AM GMTతేట తెలుగు తేనే లొలుకు అంటారు. మన భాషలోని అమ్మదనం కమ్మదనం గురించి కవులు గొప్పగా చెప్పారు. కానీ తెలుగు నాట ఆంగ్ల మాధ్యమ చదువులతో తెలుగుకు దూరమైపోతున్నాం. తల్లిదండ్రులు కూడా ఈ పోటీప్రపంచంలో తెలుగు కంటే ఆంగ్ల మీడియంలోనే పిల్లలను చదివిస్తున్నారు. భవిష్యత్ కోసం అలా చేయకతప్పని పరిస్థితి నెలకొంది.
కానీ తెలుగు రాష్ట్రాలకు దూరంగా.. ఉత్తర భారత దేశంలో హిమాలయాల దగ్గరి రాష్ట్రంలో వందలకొద్ది పాఠశాలల్లో తెలుగు భాషను బోధిస్తున్నారు. మన వదిలేస్తున్న భాషను వారు అక్కున చేర్చుకుంటున్నారు. హర్యానాలోని ప్రతి జిల్లాలో 10 ప్రభుత్వ స్కూళ్లలో తెలుగును బోధిస్తున్నారు.
తెలంగాణ టూరిజం, సంస్కృతిని దేశమంతటా పరిచయం చేయడంలో భాగంగా తెలంగాణ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగు భాష, సంస్కృతి, ప్రదేశాల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకోసం తెలంగాణ టీచర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతిరోజు హర్యానా టీచర్లకు, విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. హర్యానాలోని పలు స్కూళ్లలో తెలుగును బోధిస్తున్నారు.
జూన్ చివరివరకూ తెలుగు నేర్పించి పరీక్ష పెట్టి పాస్ అయిన వారికి తెలంగాణ రాష్ట్ర సందర్శనకు తీసుకెళుతారు. దీంతో విద్యార్థులు కూడా తెలుగు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.