Begin typing your search above and press return to search.

ట్రంప్ గుడ్ న్యూస్..జైల్లోని మ‌న వంద‌మంది సేఫ్‌

By:  Tupaki Desk   |   25 Jun 2018 9:59 AM GMT
ట్రంప్ గుడ్ న్యూస్..జైల్లోని మ‌న వంద‌మంది సేఫ్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలోని అక్రమ వలసదారుల్ని పట్టుకుని కుటుంబసభ్యుల్ని విడదీస్తున్న విషయం తెలిసిందే. మెక్సికో బోర్డర్ దగ్గర ప్రత్యేక డిటెన్షన్ సెంటర్లను ఏర్పాటు కూడా చేసింది. అక్రమంగా బోర్డర్ దాటుతున్న జంటలను ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. గత ఆరు వారాల్లో సుమారు రెండు వేల ఫ్యామిలీలను వాళ్లు వేరు చేశారు. సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తూ దొరికిన వారు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. అక్రమ ప్రవేశం కింద వాళ్లు కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వాళ్ల వద్ద ఉన్న పిల్లల్ని మరో చోట నిర్బంధించడమే ట్రంప్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మారింది.మ‌రోవైపు అక్రమ వలసదారుల్లో భారత్‌ కు చెందిన వందకు మందిపైగా ఉన్నట్లు సమాచారం.

అక్రమ వలసదారుల దగ్గర ఉన్న పిల్లల్ని వారి నుంచి వేరు చేయ‌డం... పేరెంట్స్‌ ను జైళ్లో వేయగా - పిల్లల్ని ప్రత్యేక డిటెన్షన్ సెంటర్‌ లో నిర్బంధిస్తుండ‌టం దీంతో దేశవ్యాప్తంగా అసహనం వ్యక్తం అవుతున్న నేప‌థ్యంలో ట్రంప్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అక్రమ వలసదారుల్ని వెంటనే వాళ్ల దేశాలకు పంపించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వాళ్లు చొరబాటుదారులని - అక్రమ శరణార్థులను వెంటనే వాళ్ల దేశానికి పంపించాలని - వాళ్లను కోర్టుకు తీసుకువెళ్లడం కానీ - కేసులు పెట్టడం కానీ చేయకూడదంటూ ట్రంప్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇమ్మిగ్రేషన్ బిల్లుపై త్వరలో అమెరికా చట్టసభలు ఓటింగ్ నిర్వహించనున్నాయి. తాజా నిర్ణ‌యంతో అమెరికాలో నిర్బంధంలో ఉన్న మ‌నోళ్లు వంద మంది సేఫ్ అని ప‌లువురు విశ్వ‌సిస్తున్నారు.