Begin typing your search above and press return to search.

పాకీ-స్తాన్ కు తీరింది

By:  Tupaki Desk   |   28 Sep 2015 7:36 AM GMT
పాకీ-స్తాన్ కు తీరింది
X
తిన్న‌ది అర‌గ‌క‌పో తిక్క చేష్ట‌లు చేయ‌డం, అహంకారాన్ని చూపించుకోవ‌డంలో పాకీ-స్తాన్ ను మించిన వారెవ‌రు ఉండ‌రు. ఆ దేశ గూడాచారులు, సైనికులు మొద‌లు సామాన్యుల వ‌ర‌కు ఒక‌టే బ‌లుపు. వీరికి తోడు తాజాగా ఉన్న కొద్దిమంది సాంకేతిక నిపుణులు తోడ‌య్యారు. కేర‌ళ ప్ర‌భుత్వానికి చెందిన అధికారిక వెబ్‌ సైట్‌ ను హ్యాక్ చేశారు. అయితే మ‌న‌వాళ్లేం త‌క్కువ తిన‌లేదు. పాక్ పీచ‌మ‌ణిచారు. ఇలా భారత్‌ పాక్‌ ల‌ మధ్య సైబర్‌ యుద్ధం జరిగింది. ఎలా అనుకుంటున్నారా..! చ‌ద‌వండి మ‌రి.

మొదటగా ఆదివారం ఉదయం కేరళ ప్రభుత్వ అధికారిక వెబ్‌ సైట్‌ ను పాక్‌ సైబర్‌ టీం హ్యాక్‌ చేసింది. వెబ్‌ సైట్‌ లో భారత జాతీయ జెండాను కాలుస్తున్నట్టు ఉన్న ఫొటోను పెట్టి పాకిస్తాన్‌ జిందాబాద్‌ అనే సందేశాన్ని పోస్ట్ చేశారు. వారికి వారిని 'టీం పాక్‌ సైబర్‌ అటాకర్‌' అని రాసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. చివరికు ప్ర‌భుత్వ వెబ్‌ సైట్‌ ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే ఇంత‌టితోనే క‌థ ముగిసిపోలేదు.

కేర‌ళ వెబ్‌ సైట్‌ ను య‌థాస్థానానికి తెచ్చిన త‌ర్వాత పాక్‌కు చెందిన 50 వెబ్‌ సైట్ల ను భారత సైబర్‌ బృందం హ్యాక్‌ చేసింది! నాలుగు పాక్‌ అధికారిక వెబ్‌ సైట్ల ను కూడా హ్యాక్‌ చేసి దుమ్మురేపింది!! పాకిస్తాన్‌ జెండాను కాలుస్తున్న ఫొటోను పెట్టి ' భారత సైబర్‌ వ్యవస్థకు దూరం ఉండటమే మంచిది అంటూ హెచ్చ‌రిక‌ను పోస్ట్‌ చేసింది. దీనికి ఆపరేషన్‌ పాక్‌ సైబర్‌ స్పేస్‌ అని నామకరణం చేసింది. కేరళ వెబ్‌ సైట్‌ హ్యాక్‌ చేసినందుకు ప్రతిగా తాము ఈ పని చేశామని స్ప‌ష్టం చేసింది. దీంతో తేరుకున్న పాక్‌ అధికారులు పోస్ట్‌ లను తొలగించారు. ట్విస్ట్ ఏంటంటే...ఇంకా పాక్‌ వెబ్‌ సైట్లు పనిచేయడం లేదు!