Begin typing your search above and press return to search.
పాత నోట్ల లెక్కపై కొత్త ‘లెక్క’ బయటకొచ్చింది
By: Tupaki Desk | 5 Jan 2017 5:13 AM GMTపెద్దనోట్ల రద్దు అంటూ ప్రధాని మోడీ ప్రకటించిన సంచలననిర్ణయం నేపథ్యంలో.. బ్యాంకులకు తిరిగి వచ్చిన పాత నోట్లు ఎన్ని? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నోట్ల రద్దు నేపథ్యంలో కనీసం రూ.2 నుంచి రూ.3 లక్షల కోట్ల వరకూ బ్లాక్ మనీ బయటకు రాలేదని.. అదంతా ప్రభుత్వానికి ఆదాయంగా మారి.. మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమల్నినిర్వహించేందుకు వీలుఅవుతుందన్న అంచనాలు వినిపించాయి.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. పాత నోట్ల ఎపిసోడ్ లో మోడీ అండ్ కో అంచనాలు తప్పు అయినట్లుగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా రద్దుచేసిన పెద్ద నోట్ల విలువ రూ.15.4 లక్షల కోట్లు కాగా.. డిసెంబరు 30 నాటికి బ్యాంకులకు చేరుకున్న నోట్ల విలువ దాదాపు రూ.15లక్షల కోట్లకు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం.. ఈ మొత్తం మరికాస్త పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.
డిసెంబు30 నుంచి మరికొన్ని పరిమితులతో ఆర్ బీఐ బ్రాంచిలలో పెద్దనోట్లను జమ చేసే వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో.. గడువు ముగిసే సమయానికి మరికొంత మొత్తం బ్యాంకులకు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులకు చేరిన పాత నోట్ల లెక్క విషయంలో అధికారిక ప్రకటన డిసెంబరు10న విడుదలైంది. నాటి లెక్కల ప్రకారం.. ఆర్ బీఐకి.. కరెన్సీ చెస్ట్ లకు చేరిన కరెన్సీ విలువ రూ.12.44 లక్షల కోట్లుగా చెబుతున్నారు. అనంతరం బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం కలిపితే.. రూ.15లక్షల కోట్ల వరకూ ఉందని తెలుస్తోంది. ఈ సమాచారం కానీ నిజమైతే.. పెద్ద నోట్ల రద్దుతో భారీగా నల్లధనాన్ని అడ్డుకొని.. పెద్ద ఎత్తున నగదును ప్రభుత్వ ఖాతాలో వేసుకోవచ్చన్న మోడీ టీం ప్లాన్ అట్టర్ ప్లాప్ అయినట్లేనని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/