Begin typing your search above and press return to search.
ఆనంను అందుకే తప్పించారు: నేదురుమల్లి రామ్ కుమార్
By: Tupaki Desk | 4 Jan 2023 7:00 AM GMTనెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డిపై తాజాగా వెంకటగిరి నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమితులైన మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు, నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఉద్దేశ పూర్వకంగానేఆనం వైసీపీపై విమర్శలు చేస్తున్నారని.. చేశారని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రభుత్వంపై విమర్శలకు దిగారని అన్నారు.
అంతేకాదు, ఆనం పార్టీని సరైన స్థాయిలో నడిపించలే కపోయారని నేదురుమల్లి వ్యాఖ్యానించారు. అందుకే ఆనం రామనారాయణరెడ్డిని ఇంచార్జ్ పోస్టు నుంచి తప్పించారని చెప్పారు. ప్రస్తుతం తాను తిరుపతి జిల్లా వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నారని.. ఇప్పుడు తనకు అదనంగా వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలు కూగా అప్పగించారని అన్నారు.
సమర్థవంతంగా పనిచేసి.. అధిష్టానం అంచనాలను చేరుకుంటానని నేదురుమల్లి చెప్పారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేస్తారా? అన్నదానికి మాత్రం ఆయన ఆన్సర్ దాటవేశారు. అంతా అధిష్టానం ఇష్టమని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఇలా చార్జ్ తీసుకోగానే.. అలా ఆనంపై విమర్శలు గుప్పించడం చూస్తే.. అధిష్టానం రామ్‌కు ఫుల్ పవర్స్ ఇచ్చేసిందనే వాదన వినిపిస్తోంది.
2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర సమయంలో రామ్ కుమార్.. ఆయనను కలుసుకున్నారు. అయితే.. ఆ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఆనం కు అవకాశం ఇచ్చారు. ఇక, అప్పటి నుంచి వెయిటింగ్‌లో ఉన్న ఆనంకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌దక్కే ఛాన్స్‌స్ఫస్టం గా కనిపిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.