Begin typing your search above and press return to search.
వీళ్ల పెళ్లి ఆహ్వానం చూస్తే షాక్ అవుతారు..!
By: Tupaki Desk | 21 March 2021 6:58 AM GMTప్రస్తుతం దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. ప్రజలు మాత్రం కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇప్పటికే మహారాష్ట్రలో సెకండ్‌వేవ్ మొదలైంది. కర్ణాటకలోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. ప్రజలు మాత్రం కరోనా జాగ్రత్తలు పాటించడం లేదు.. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం అనే విషయాన్ని మర్చిపోయి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు, వైద్యులు, అధికారులు మాత్రం కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటూ సూచిస్తున్నారు. ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
అయితే కరోనా టైంలోనూ అక్కడక్కడా వివాహ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి తన పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎంతో విభిన్నంగా తయారుచేయించాడు. తన పెళ్లికి రావాలంటే కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనంటూ తన బంధువులకు సూచించాడు. దీంతో అతడి బంధువులంతా కరోనా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గోకుల్ అనే యువకుడికి విజయవాడకు చెందిన భవ్య అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. జూన్ 5న ఈ జంట వివాహ బంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు.
ఇదిలా ఉంటే సదరు పెళ్లి కుమారుడు ఓ షరతు విధించాడు. తన పెళ్లికి రావాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిదేనంటూ నిబంధనల పెట్టాడు. దీంతో శనివారం గోకుల్ కుటుంబసభ్యులు, అతడి కుటుంబసభ్యులు 20 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. సాయి భాస్కర్ అనే ఆస్పత్రిలో వీళ్లంతా వ్యాక్సిన్ తీసుకున్నారు. సదరు పెళ్లికొడుకు శ్రద్ధను ఆస్పత్రి యాజమాన్యం అభినందించింది. కరోనా పట్ల అందరూ ఇలాగే అవగాహనతో ఉండాలని.. తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.