Begin typing your search above and press return to search.

ఎన్నికల అధికారులకు నీలం సాహ్ని వార్నింగ్​ .. ఎందుకంటే

By:  Tupaki Desk   |   6 April 2021 4:13 AM GMT
ఎన్నికల అధికారులకు నీలం సాహ్ని వార్నింగ్​ .. ఎందుకంటే
X
ఏపీలో ప్రస్తుతం పరిషత్​ ఎన్నికలు సాగుతున్న విషయం తెలిసిందే. గతంలోనే ఇచ్చిన నోటిఫికేషన్​ కు అనుగుణంగా ఈ ఎన్నికలు సాగుతున్నాయి. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కానీ చంద్రబాబు నిర్ణయాన్ని మెజార్టీ నేతలు ధిక్కరించారు. ఆయా చోట్ల పోటీలో ఉన్నారు. పోటీనుంచి తప్పుకుంటే క్యాడర్​ చెల్లా చెదురు అవుతుందని వాళ్లు భయపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఏప్రిల్​ 8న ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల రోజు సెలవు ప్రకటించాలని .. అలా అయితేనే అన్ని వర్గాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం ఉంటుందని నీలం సాహ్ని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆ రోజున సెలవు ప్రకటించాలంటూ ఆమె ప్రభుత్వానికి లేఖ రాశారు.

అంతేకాక పోలింగ్​ జరిగే రోజు అన్ని చోట్ల కార్యాలయాలు, వ్యాపారాలు బంద్​ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలని కోరారు. ఎన్నికల విధుల నిర్వహణకు ప్రభుత్వ వాహనాలు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పిస్తూ ఓ జీఓ జారీ చేశారు. వాహనాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

ఇటీవలే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఓటర్లకు కుడిచేతికి ఇంక్​ మార్క్​ వేశారు. ఆ మార్క్​ చాలా మందికి చెరిగిపోలేదు. కాబట్టి ఇప్పుడు ఎడమ చేతికి ఇంక్​ మార్క్​ వేయాలని ఆదేశించారు. ఏ ప్రభుత్వ అధికారి కూడా రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించకూడదని ఆమె సూచించారు. ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మరోవైపు ఏపీలో పరిషత్​ ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అన్ని రాజకీయపార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి.